YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తుపానుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం

తుపానుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
‘ఫణి’ సూపర్ సైక్లోన్‌ బారి నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది. ఇది ఏపీ తీర ప్రాంతాన్ని దాటి వెళ్లిపోవడంతో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పినట్లేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని తాకింది. మూడు గంటల పాటు తీరంలోనే కొనసాగనున్న ‘ఫణి’ గోపాలపురం-చాంద్‌బలి వద్ద తీరాన్ని దాటి వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో పూరీ తీరంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి.మరోవైపు ఒడిశాలో తీరం దాటిన తర్వాత ‘ఫణి’ తుపాను పశ్చిమబెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌ వైపు వెళ్లుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటినప్పటికీ ఇది ఇంకా బలహీనపడే అవకాశం లేదని చెబుతుండటంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన తీర ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సహాయచర్యలు చేపట్టేలా సీఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేశారు. 

Related Posts