యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
వీవీ ప్యాట్ల లెక్కింపుపై విపక్షాలు సుప్రీం కోర్టులో వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరపనుంది. శుక్రవారం చీఫ్ జస్టిస్ గొగోయ్ ముందు విపక్ష పార్టీల తరఫున పిటిషన్‌ను అభిషేక్ మను సంఘ్వీ సీజే ముందు ప్రవేశపెట్టారు. దీంతో ఆయన పిటిషన్‌ను విచారణకు అంగీకరించారు. చంద్రబాబు నాయుడుతోపాటు బీజేపీయేతర పక్షాలు21 పార్టీలు 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్లు లెక్కించాలని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 35 వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్షాలు 50శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు జరగాల్సిందేనని పేర్కొంటూ మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై వచ్చేవారం విచారణ జరపనుంది.