యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
సమాజంపై బాధ్యతతో ఆలోచించి సినిమాలు తీయాలని చిత్ర దర్శకుడు నరసింహ నందితో పాటు ఇతర దర్శకులకు విన్నవించారు జీవితా రాజశేఖర్. సినిమా తీయడమనేది చాలా కష్టమైన పని. సినిమా తీయడమెంత కష్టమో.. దాన్ని రిలీజ్ చేయడం ఇంకా కష్టంగా మారిందన్నారు. నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిగ్రీ కాలేజ్ ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన జీవితా రాజశేఖర్, ట్రైలర్‌ను విడుదల చేశారు.విడుదల అనంతరం ఈ ట్రైలర్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని అన్నారు.అయినా కూడా సినిమాపై ప్యాషన్‌తో చాలా మంది ఇక్కడే ఉంటున్నారనే కారణాలతో నేను ఈ ఫంక్షన్‌కి వచ్చాను. డైరెక్టర్ నరసింహ నంది డైరెక్ట్ చేసిన డిగ్రీ కాలేజ్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి రాంగ్ పర్సన్‌గా నన్ను పిలిచారనుకుంటున్నాను. నేను సెంట్రల్ సెన్సార్‌బోర్డు మెంబర్‌ని. ఈ సినిమా ట్రైలర్ ఇంకా సెన్సార్ కాలేదనే అనుకుంటున్నాను. ఆర్.ఎక్స్ 100 అర్జున్ రెడ్డి పుణ్యమా అని తెలుగు సినిమాలు ఈ మధ్య లిప్ లాక్ సీన్స్ లేకుండా రావడం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేక్ అవుట్స్ లేకుండా, లిప్ లాక్స్ లేకుండా సినిమాలు తీయకూడదు అనే పరిస్థితికి తెలుగు సినిమా దిగజారిపోయిందనుకుంటున్నాను. నేను చూసిన ట్రైలర్‌లో నాలుగైదు షాట్స్ లిప్‌లాక్సే ఉన్నాయి. అలాగే పోస్టర్‌లో కూడా అదే ఉంది. ఈ సందర్భంలో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే బాత్‌రూమ్‌లోనే స్నానం చేస్తాం. బెడ్‌రూంలోనే పడుకుంటాం. హాల్లో వచ్చి స్నానం చేయం. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది ఎక్కడ చేయాలో అక్కడే చేస్తే బావుంటుంది. పబ్లిక్‌గా రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఈవాళ, రేపు లిప్ లాక్ అనేది సినిమాల్లో ముఖ్యమైపోయింది. అలాగే బట్టలిప్పుకోవడం .. అమ్మాయిలు అబ్బాయిల మీదెక్కి కూర్చోవడం, అబ్బాయిలు అమ్మాయిల మీదెక్కి కూర్చోవడం కామన్‌గా కనపడుతున్నాయి. అంటే ఈ విషయాలు ఇది మీ జీవితంలో లేదా అనొచ్చు. ఉన్నాయి. కానీ రోడ్డు మీద చేయలేం కదా. ఇలా ఎందుకు చేయకూడదు, ఎందుకు సెన్సార్ ఇవ్వరు అని అడ్డంగా వాదించే డైరెక్టర్స్‌తో మనం వాదించలేం. కానీ ఈ విషయాలు సోషల్ మీడియా కంప్యూటర్‌లో ఉండటం లేదా అని కూడా అనొచ్చు. కంప్యూటర్‌లో ఇలాంటి విషయాలను మనం ఒకరిద్దరమో చూస్తాం. కానీ సినిమా అనేది కొన్ని వందల మంది కలిసి చూసేది. కొన్ని వందల మంది మధ్యలో మనం శృంగారం చేయలేం. ఇలాంటి విషయాల్లో సెన్సార్ కూడా చేయలేకపోతున్నాం. ఏమైనా చెబితే ప్రెస్‌మీట్స్ పెట్టేసి సినిమాను అపేశామని అంటున్నారు. కోర్టులకు వెళ్లిపోతున్నారు. కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం సోసైటీలో ఉన్నాం. మన ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలున్నారు. సినిమాలో ఏదైనా చెప్పొచ్చు. కానీ దాన్ని అందరూ చూసేలా అందంగా చెప్పాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగని డిగ్రీ కాలేజ్ సినిమాను తప్ప పట్టడం లేదు. ఇప్పుడున్న దాని ప్రకారం నరసింహ నంది సినిమా చేశారు. సినిమా ఇలాగే ఉంటేనే సక్సెస్ అవుతుందనేది పూర్తిగా తప్పుడు ఆలోచన. మీరు ఏమీ తీసినా.. బట్టలిప్పించి అమ్మాయిల్ని చూపించినా సినిమాలో విషయం ఉంటేనే సినిమా ఆడుతుంది. నేను సెన్సార్ బోర్డు మెంబర్‌గా ప్రతి దర్శకుడు, రైటర్‌కు విన్నవించుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ ఉంటే సినిమాకు సెన్సార్ చేయడం కూడా కష్టమైపోతుంది. కొన్సిని నిమాలకు అసలు సెన్సార్ ఇవ్వకూడదని చెప్పాలనిపిస్తుంది. కానీ.. నిర్మాత కోట్లు ఖర్చు పెట్టేశాడే! అయ్యో అనిపిస్తుంది. నిర్మాత రోడ్డు మీదకు వచ్చేస్తాడు. అని నేను మెంబర్‌్ుతో మాట్లాడి కన్విన్స్ చేసి కొన్ని ఎడిటింగ్స్ చేయించి సెన్సార్ ఓకే చేస్తున్నాం. డిగ్రీ చదువుకునే యూత్ ఏజ్ ఏటైనా డైవర్ట్ అయిపోయే ఏజ్. మంచి చెబితే మంచి.. చెడు చెబితే చెడు.. వీటి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. దాని గురించి ఆలోచించండి. ఇద్దరి ఆడపిల్లలకు అమ్మగా చెబుతున్నాను. ఈ సోసైటీపై రెస్పాన్సిబిలీ ఉన్న లేడీలా ఫీలై చెబుతున్నాను. ఆలోచించి సినిమాలు తీయండని అన్నారు జీవితా రాజశేఖర్.