YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

5న నీట్ కు అంతా సిద్ధం

5న నీట్ కు అంతా సిద్ధం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వైద్య కళాశాలల్లోని ఎంబిబిఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించే నీట్‌  ప్రవేశ పరీక్ష ఈ నెల 5వ తేదీన జరుగనుంది. ఇప్పటికీ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులను, సిబ్బందిని జిల్లా యాంత్రంగా ఏర్పాటుచేసింది. నగరంలోని రీజనల్‌ సెంటర్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మే 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగునుంది. పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఉదయం 9.30 గంటల కల్లా చేరుకోవాల్సి ఉంటుంది. జాతీయస్థాయిలో నిర్వహించే నీట్‌ - 2018 ప్రవేశ పరీక్షకు విజయవాడ రీజియన్‌లో ఇద్దరు కో ఆర్డినేటర్లతో పాటు ఐదుగురు జిల్లా స్థాయి అధికారులను నియమించారు. వీరి నిర్వహణలోనే పరీక్ష జరుగుతుంది. నగరంలోని ఏర్పాటుచేసిన 31 పరీక్షా కేంద్రాల్లో 17,650 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటుచేయనున్నారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. నగరంలో ఉండే ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఇబ్బందలు తలెత్తకుండా తాగునీటి సౌకర్యం కూడా పరీక్షాకేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆయా పరీక్షాకేంద్రాల నిర్వాహకులకు తెలియచేశారు.
- పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకురావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు పలుచటి వస్త్రాలతో కూడిన దుస్తులు ధరించాల్సి ఉంటుందని, దుస్తులు పెద్దగుండీలు, బ్యాడ్జీలు ఉండరాదు.
- పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బూట్లను ధరించకూడదు. కాళ్లకు స్లిప్పర్స్‌, తక్కువ ఎత్తు ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. 
- విద్యార్థులు ఎటువంటి ఆభరణాలతో పరీక్షకు హాజరుకాకూడదు. 
- ఎటువంటి ప్రింటింగ్‌ మెటీరియల్‌, పుస్తకాలు, జామెంట్రీ బాక్స్‌, కాలిక్యులేటర్‌, పెన్ను, స్కేలు, రైటింగ్‌ ప్యాడ్‌, పెన్‌డ్రైవ్‌, ఎరైజరు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించడం జరుగదు.
- మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌, మైక్రోఫోన్స్‌, పేజరు, హెల్త్‌ బ్యాండ్లను అనుమతించరు. 
- హేండ్‌ బ్యాగులు, బెల్ట్‌లు, క్యాప్‌లు, ఎటిఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ప్లాస్టిక్‌ ఐడెంటిటీ కార్డులు, రిమోట్‌ పరికరాలు అనుమతించరు. 
- వాచెస్‌, కెమెరాలు, మోటాలిక్‌ వస్తువులను, తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్‌ను అనుమతించరు.

Related Posts