యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నటి త్రిష పుట్టిన రోజు నేడు (మే 4). ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్ డ్ విషెస్ చెబుతున్నారు. ఆమెతో కలిసి ‘పౌర్ణమి’ మూవీలో నటించిన చార్మీ కూడా త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. త్రిష తనను ముద్దాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన చార్మి.. బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఫరెవర్ అని ట్వీట్ చేసింది. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా ప్రపోజల్‌ను ఎప్పుడు అంగీకరిస్తావా అని నేను మోకాళ్ల మీద నిలబడి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు చట్టపరంగా ఇది సమ్మతమే అని సరదాగా ట్వీట్ చేసింది. మరో వైపు త్రిష మాత్రం మూడు పదుల వయసులోనూ వరుసబెట్టి సినిమాల్లో నటిస్తోంది. త్రిష బర్త్ డ్ సందర్భంగా ఆమె నటించిన ‘పరమపదం విలయాట్టు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. 'తిరుజ్ఞానం' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్రిష కెరీర్లో 60వ సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలోనూ చార్మీ ఇలాగే త్రిషతో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది. అప్పట్లో త్రిష కూడా చార్మీ ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. ఈసారి మాత్రం ఇంకా స్పందించలేదు. చార్మీ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ భాగస్వామ్యంలో పూరీ కనెక్ట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.మరో వైపు త్రిష మాత్రం మూడు పదుల వయసులోనూ వరుసబెట్టి సినిమాల్లో నటిస్తోంది. త్రిష బర్త్ డ్ సందర్భంగా ఆమె నటించిన ‘పరమపదం విలయాట్టు’ ట్రైలర్‌ను విడుదల చేశారు. 'తిరుజ్ఞానం' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్రిష కెరీర్లో 60వ సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.