YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారు : చంద్రబాబు

కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారు : చంద్రబాబు

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఓటర్లు ఏపీకి రాకుండా, టీడీపీకి ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. హైదరాబాదు నుంచి ఏపీకి వచ్చే బస్సులను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. అయినా ఓటర్లు తమ సొంత వాహనాల్లో వచ్చి, పట్టుదలతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. తెలంగాణ కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. అధికారుల్లో చీలిక తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలనేదే తన సంకల్పమని చెప్పారు.ఎన్నికల సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని... కానీ, ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి రాలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ తప్పు చేసిందని ఏ ఒక్కరైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. తొలి దశలో ఎన్నికలను నిర్వహించడమే మేలైందని చెప్పారు. ప్రధాని మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుని ఉంటే చాలా నష్టపోయేవాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి సహకారం అందిస్తారని ఎంతో ఎదురు చూశామని, సరైన సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందని అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే... పదవులు, కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే రెండు, మూడు సీట్లకు అప్పుడే బేరాలు ప్రారంభించారని విమర్శించారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ సమీక్షా సమావేశాల్లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు పన్నిన కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు చెప్పారు. టీడీపీకి నష్టం కలిగించాలనేది బీజేపీ ధ్యేయమని, వారికి కేసీఆర్, జగన్ ల కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నారని... ఆ కుట్రలు తెలిసే ఓటింగ్ కు తరలి రావాలని ప్రజలకు తాను పిలుపునిచ్చానని చెప్పారు. ముహూర్తాలు, ప్రమాణాలు, మంత్రి పదవులు అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. టీడీపీ విజయంపై సందేహం లేదని.. ఆధిక్యత ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని చెప్పారు.
ఈ ఆరు జిల్లాలు జరా భద్రం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ నుంచి అందిన తాజా వాతావరణ హెచ్చరికలను ప్రజలకు అందించారు. ఇవాళ ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడమే కాకుండా, తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందిందని వివరించారు.ప్రజలు సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండడం, వేసవి తాప నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నుంచి కాపాడుకోవాలని సూచించారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Related Posts