Highlights
- రాజన్న రాజ్యం సాధించాలన్న తపన పెరిగింది
- ప్రజా సంకల్ప యాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా
- వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్లురు క్రాస్ మీదుగా జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో బుదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకు పాదయాత్రను కొనసాగించిన జగన్ ఆ రాత్రి ఇక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1340 కిలోమీటర్లు నడిచారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజ్యం సాధించాలన్న తపన నాలో పెరుగుతుందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా వైయస్ జగన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇవాళ్టితో వంద రోజుల పాదయాత్ర పూరై్తంది. పాదయాత్రలో నిత్యం మీ నుంచి అభిమానం, మద్దతు అందుకుంటున్నా..మెరుగైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి ముందుకు నడుస్తున్నాం. పాదయాత్రలో ఒక్కో రోజు గడుస్తున కొద్దీ రాజన్న రాజ్యం సాధించాలన్న తపన నాలో పెరుగుతుందని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.