YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముద్రగడకు కాపు ఎవరు కాస్తారు...

ముద్రగడకు కాపు ఎవరు కాస్తారు...

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

ముదగ్రడ పద్మనాభం. కాపు ఉద్యమనేత గా ఇప్పుడు మనకు అప్పుడప్పుడూ కన్పిస్తున్నారు. కానీ ముద్రగడ రాజకీయ జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనన్నది ఆయన సన్నిహితులు సయితం అంగీకరిస్తున్న విషయం. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముద్రగడకు ఇక ఛాన్స్ లేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయన చేపట్టిన ఉద్యమం కూడా ఇక ముందుకు సాగేలా కన్పించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కూడా దాదాపుగా నీరుగారి పోయినట్లే.ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికల బరిలోకి దిగుదామని తొలుత భావించారు. ఆయన జనసేన పార్టీలోకి వెళదామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఇక టీడీపీ నుంచి ముద్రగడ కు బంపర్ ఆఫర్ వచ్చిందన్న ప్రచారమూ జరిగింది. ప్రత్తిపాడు టిక్కెట్ ఇస్తామని టీడీపీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆయన తమ ఉద్యమంలో పాల్గొన్న మరికొందరికి టిక్కెట్లు అడగడంతో ఆయనను తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిందన్న ప్రచారమూ జోరుగానే సాగింది.అయితే ఈ ఎన్నికల్లో ముద్రగడ ఎవరి తరుపున ప్రచారం చేయలేదు. కొంతకాలం క్రితం జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ముద్రగడ పనిచేశారు. అయినా అక్కడ టీడీపీనే విజయం వరించింది. ఉద్యమం చేస్తున్న తనను గృహనిర్భంధం చేయడం, తన వారిపై అక్రమ కేసులు బనాయించడంపై ముద్రగడ టీడీపీపై గుర్రుగా ఉన్నారు. అయినా తనను నమ్ముకున్న వారికోసం ఏదో ఒక పార్టీలో చేరాలనుకున్నా అది సాధ్యపడలేదు. వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్లు తన చేతిలో లేవని, దానిపై ఎటువంటి హామీ ఇవ్వలేనని తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ప్రకటించడంతో ముద్రగడ ఆ పార్టీ వైపు చూడలేదంటున్నారు.ఇప్పుడు ముద్రగడ వచ్చేఐదేళ్ల కాదు మరో ఐదేళ్లకు కూడా ఏ పార్టీ ద్వారాలు తెరవన్నది అర్థమయింది. ఒక సామాజికవర్గం నేతగా ముద్రపడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందనే వారు లేకపోలేదు. ముఖ్యంగాతూర్పు గోదావరిజిల్లాలో కాపు సామాజికవర్గంతో పాటు శెట్టి బలిజలు అధికంగా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో ఉప కులాలు ఉన్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలు వ్యతిరేకమవతారు. ఇన్ని ఈక్వేషన్ల మధ్య ఒకనాడు చక్రం తిప్పిన ముద్రగడ ఇప్పుడు కిర్లంపూడికే పరిమితం కావాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కూడా ముద్రగడను పార్టీలో చేర్చుకునే ధైర్యం చేయలేదంటున్నారు.

Related Posts