YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో రఘవీరా బోణి...

అనంతలో రఘవీరా బోణి...

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశలు సజీవంగా ఉన్నాయా? ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలోకి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అడుగుపెడతాడా? ఆ ఒక్కరూ రఘువీరారెడ్డి మాత్రమేనా? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. రఘువీరారెడ్డి గెలుపు కు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారట. అయితే గెలుపు అని ఖచ్చితంగా చెప్పలేము కాని అవకాశాలు మాత్రం బలంగా ఉన్నాయంటున్నారు. ఇక్కడ వైసీపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే ఫైట్ జరిగిందన్నది వాస్తవం. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ మధ్యనో, లేదా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ జరిగింది. కానీ అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ మధ్యనే పోరు జరిగింది.పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూనే కల్యాణ దుర్గంపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐదేళ్లుగా అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. అంతకుముందు మడకశిరలో గెలుస్తూ వచ్చిన రఘువీరారెడ్డి అది రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి రఘువీరారెడ్డి గెలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని రఘువీరారెడ్డి పరీక్షించుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి వీక్ కావడం, కొందరు టీడీపీ నేతలు చివరి నిమిషంలో కాంగ్రెస్ కు సహకరించడం వల్ల రఘువీరారెడ్డి గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐదు, టీడీపీ ఆరుసార్లు గెలిచాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హనుమంతరాయ చౌదరి వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిపై దాదాపు 22 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే టీడీపీ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా మారారంటున్నారు. చివరి నిమిషంలో ఆయన వైసీపీ అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్ కు మద్దతు తెలిపారన్నది నియోజకవర్గంలో విన్పిస్తున్న టాక్.టీడీపీ అభ్యర్థిగా ఉమామహేశ్వరనాయుడు పోటీ చేశారు. అయితే ఇక్కడ చివరి నిమిషంలో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి వైపు మరలాయన్నది టాక్. అదే జరిగితే తన గెలుపు సాధ్యమని రఘువీరారెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఆశాకిరణంగా కన్పిస్తుంది కల్యాణదుర్గం నియోజకవర్గం మాత్రమే. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ కూడా గట్టి పోటీ ఇచ్చారంటున్నారు. మొత్తం మీద కల్యాణదుర్గంలో మాత్రం టఫ్ ఫైట్ జరిగిందంటున్నారు. రఘువీరారెడ్డి గెలిస్తే ఆయనతో పాటు కాంగ్రెస్ విభజన అనంతరం ఏపీ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతుందన్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts