యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పరిస్థితిపై విహంగ వీక్షణం చేశారు. ఎన్నికల నియమావళి అడ్డు వస్తుందన్న వ్యాఖ్యల నేపథ్యంలో తొలుత కాస్త వెనుకడుగు వేసినా అటువంటి నిబంధన ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉదయం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం నిర్మాణం నా చిరకాల వాంఛ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులను సోమవారం చంద్రబాబు పర్యావేక్షించారు. స్పిల్వే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. స్పిల్వే 25.72 మీటర్లు పూర్తి అయినట్టు తెలిపారు. ఎగువ కాఫర్ డ్యామ్ 52 శాతం పూర్తి అయిందని వివరించారు. 30శాతం దిగువ కాఫర్ పూర్తి అయినట్టు తెలిపారు. ఇవన్నీ పూర్తయితేనే నీటిని అందిస్తామని చెప్పారు. 71శాతం మొత్తం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 16,493 కోట్లు ఖర్చు అయినట్టు తెలిపారు. రాష్ట్రం 5,135 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం ఇచ్చింది 6,720 కోట్లేనని అన్నారు. కాంక్రీట్ పనుల్లో గిన్నీస్ రికార్డ్ సృష్టించామని గుర్తు చేశారు. ఈ సీజన్ లో రెండు కాఫర్ డ్యామ్ లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. స్పిల్వే పనులు అవకాశం ఉన్నంత వరకు పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల వల్ల పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. 2020 మే నాటికి పూర్తి స్థాయి పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ఈ జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వలేమన్నారు. 2020 నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం...కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం లేదని చెప్పారు.