YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2020 తర్వాత డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గనుందా?

2020 తర్వాత డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గనుందా?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఏటా పెరుగుతున్న కాలుష్య ఉద్గారాల సంఖ్యను తగ్గించేందుకు పలు సంస్థలు డీజిల్ వాహనాలను బంద్ చేసే దిశగా దృష్తి సారించాయి.. 2020 తర్వాత నుంచి డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ ఏజెన్సీ ఫైనాన్స్‌ ఒక సర్వేలో పేర్కొంది. దీంతో డీజిల్ వాహనాలు తీసుకున్న వారిలో గందరగోళం నెలకొంది. కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళన కూడా డీజిల్‌ ఇంజిన్లకు స్వస్తి పలికేందుకు కారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా 3,000 పట్టణాల్లో గ్రీన్‌ పీస్‌ అండ్‌ ఎయిర్‌ విజువల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి 30 అత్యంత కాలుష్య పట్టణాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దిల్లీలో కాలుష్యాన్ని అడ్డుకొనేందుకు అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగడం డీజిల్‌ కార్ల డిమాండ్‌ పై ప్రభావం చూపింది. దీంతో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై నిబంధనలు విధించింది. దీంతో పెట్రోల్, విద్యుత్ వాహనాలు మార్కెట్లను భవిష్యత్ లో భారీగా పెరగనున్నట్టు సమాచారం. ప్రభుత్వం కూడా దేశంలో విద్యుత్తు, సీఎన్‌జీ వాహనాల తయారీని ప్రొత్సహించే వాతారణాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో భాగంగా 2030 నాటికి 10వేల సీఎన్‌జీ పంపులను ప్రారంభించనుంది. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఆధారిత వాహనాలను ప్రోత్సహించనుంది. మరోపక్క ఫోక్స్‌ వ్యాగన్‌ ఉద్గారాల కేసు తర్వాత డీజిల్‌ ఇంజిన్లపై నిఘా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిబంధనల అమల్లో ఏమాత్రం తేడా వచ్చినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కంపెనీలు కూడా డీజిల్‌ ఇంజిన్ల వైపు మొగ్గు చూపడంలేదు. 2020 తర్వాత నుంచి డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గుతుందని సర్వేలో పేర్కొంది. అదే సమయంలో విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పెరగనుంది. ఎటువంటి రాయితీలు లేకుండా మిగిలిన కార్లతో పోటీపడే స్థాయికి ఈవీలు 2024కు చేరుకొంటాయని పేర్కొంది.

Related Posts