YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం

 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ఏపీలోని 210 మండలాల్లో వడగాల్పుల ప్రమాదం ఉందని హెచ్చరించింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని, ఈ నెల10 వరకు ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో 45, కుకునూరులో 44, చింతలపూడి 43, పెంటపాడులో 43, నిడదవోలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో 46, ఒంగోలు, సంతనూతలపాడులో 45, కురిచేడులో 45 , నెల్లూరులో 46, పదునుకూరులో 45, జలదంకిలో 44, గూడురులో 44, వెంకటగిరిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు

Related Posts