YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

35కు చేరిన ఫోణి మృతులు

35కు చేరిన ఫోణి మృతులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఫొని తుఫాన్ మృతుల సంఖ్య 35కు పెరిగింది. పూరీ పట్టణంలోనే 21 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఒడిశాపై విరుచుకుపడిన పెను తుఫాన్ ఆ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం బాధితులకు పరిహారం ప్రకటించారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన పూరీతోపాటు ఖుర్దాలో నివసిస్తున్న పేదలకు రూ.2వేల నగదు, 50 కిలో ల బియ్యం, పాలిథీన్ షీట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల కుటుంబాలకు రూ.వెయ్యి నగదు, నెల కోటా బియ్యం, పాలిథీన్ షీట్లు, పాక్షికంగా ప్రభావితమైన వారికి నెల కోటా బియ్యం, 500 నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.95,100, పాక్షికంగా దెబ్బతింటే రూ.52వేలు, స్వల్పం గా దెబ్బతింటే రూ.32వేలు సాయం అందజేస్తామని చెప్పారు. ఇంకా చాలా ప్రాంతాల నుంచి నష్టంపై సమాచారం రావాల్సి ఉన్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.ప్రచండ తుఫాన్‌ను ఒడిశా ఎదుర్కొన్న తీరుపై న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు కురిపించింది. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఓ పేద రాష్ట్రం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అత్యంత తక్కువ సమయంలో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధారణ విజయమని కొనియాడింది. 26 లక్షల సందేశాలు, 43 వేల వలంటీర్లు, వెయ్యి మంది అత్యవసర సిబ్బంది, టెలివిజన్ ప్రకటనలు, సైరన్లు, బస్సులు, పోలీస్ అధికారులు, ప్రజా వేదికలు ఇలా అన్ని మార్గాల ద్వారా స్థానిక భాషలో స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారని పేర్కొంది. మృతుల సంఖ్య తక్కువగా ఉండడం ముందస్తు హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయనడానికి నిదర్శనమని తెలిపింది. 20 ఏండ్ల కిందట ఇలాంటి తుఫాన్‌కు వేల మంది మృతిచెందగా, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నది. 

Related Posts