YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమర్థ ఆర్థిక  నిర్వహణ వ్యవస్థకు శ్రీకారం..

Highlights

  • ఏప్రిల్ ఒకటి తర్వాత సి.ఎఫ్.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా లావాదేవీలు .. 
  • చెల్లింపులు మరింత సరళతరం 
  • రేసీట్ మాడ్యూల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి 
సమర్థ ఆర్థిక  నిర్వహణ వ్యవస్థకు శ్రీకారం..

రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన సమగ్ర ఆర్థిక  నిర్వహణ వ్యవస్థ (సి.ఎఫ్.ఎం.ఎస్) ను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ఐటీ శాఖ, సాప్ సంస్థ రూపొందించిన ఈ కొత్త వ్యవస్థ  - సి.ఎఫ్.ఎం.ఎస్ రిసీట్ ల మాడ్యూల్ ను ముఖ్యమంత్రి బుధవారం ఉండవల్లి నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్ లో ప్రారంభించారు. ఒకానొకప్పుడు  సంక్లిష్టంగా ఉన్న ఆర్థిక   లావేదేవీల విధానం ఇప్పుడు సరళతరం అయ్యేలా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.  తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఆలోచనను అధికారులతో పాలుపంచుకున్నానని అయితే ప్రభుత్వం మారడం వల్ల కొంతకాలం ఈ ప్రతిపాదన పక్కకు వెళ్లి ఇప్పుడు ఈ విధానం  ఆచరణ రూపం దాల్చిందని  ఆయన తెలిపారు.  
సి.ఎఫ్.ఎం.ఎస్ వల్ల అన్ని ప్రభుత్వ శాఖ ల ఆర్థిక   లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోకి అనుసంధానం అవుతాయి. ఆర్బీఐ తో కూడా లావాదేవీలు సులభతరంగా ఆన్ లైన్ లోనే నిర్వహించవచ్చు.  ఈ వ్యవస్థ సమర్థవంతంగా కింది స్థాయి వరకు అమలు చేయాలంటే గ్రామా పంచాయితి స్థాయిలోని హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ శాఖ లోని ఖర్చులు, ఆదాయం ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు ఈ కొత్త ప్రక్రియ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిజ్ఞానంపై 300 ఇంజనీరింగ్ కళాశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని, ప్రజల్లో కూడా దీనిపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నేడు రిసీట్ ల వరకే మాడ్యూల్ ను ప్రారంభించామని, ఖర్చులు, ఇతర మాడ్యూళ్ళను కూడా మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం ద్వారానే లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మన రాష్ట్రంలో వినూత్న తరహా లో అమలు చేస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ అనేక మంది ప్రశంసిస్తున్నారని, ఇటీవల జపాన్ వారు కూడా ఇక్కడి విధానాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక   మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మొత్తం ఆర్థిక   వ్యవస్థలో ఆదాయం బట్టి వ్యయం ఉంటుందని,  దీనిని ఒక క్రమపద్ధతిలో నిర్వహణలోకి తీసుకొస్తే ఇంకా ఆర్థిక   పరిస్థితి మెరుగవుతుందని అన్నారు. ఈ ఆలోచనకు ముఖ్యమంత్రి అంకురార్పణ చేసి ఇప్పుడు అమలులోకి తెచ్చారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జే.సత్యనారాయణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. సాంబశివ రావు, ఎస్.ఏ.పి  సీఎండీ డిఎస్ గుప్త, ఆర్థిక    కార్యదర్శి రవిచంద్ర,  ఈ సందర్భంగా మాట్లాడారు. సి.ఎఫ్.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా వృత్తి పన్ను చెల్లింపు నమూనా ను ఈ సందర్భంగా విజయవంతంగా ప్రదర్శించి చూపారు.

Related Posts