యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఎన్నికల సంఘంతో ఢీ అంటే ఢీ అంటున్న చంద్రబాబు.. సమీక్షల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. నిబంధనల పేరుతో చేతులు కట్టేస్తే కుదరని కుండ బద్దలు కొట్టేశారు. పోలవరం పర్యటనకు వెళ్తాను.. దమ్ముంటే ఆపండంటూ సవాల్ విసిరారు. చెప్పినట్లుగానే సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఏరియల్ సర్వే చేశారు.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడన్నారు చంద్రబాబు. పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛని.. ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 70.17శాతం పూర్తి చేశామమన్నారు. ఇప్పటివరకు 90సార్లు వర్చువల్ ఇన్స్‌ఫెక్షన్ చేశామని చెప్పుకొచ్చారు. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తయితే కరువును జయించొచ్చన్నారు. ఈ ఏడాది గ్రావిటీ ద్వారా సాగునీరందిస్తామన్నారు. ఎన్నికలతో బిజీగా ఉన్న చంద్రబాబు.. పోలవరం పనులపై సమీక్ష నిర్వహించలేదు. పోలింగ్ ముగిశాక పోలవరం పనులపై సమీక్ష చేశారు. కానీ ఈ సమీక్షపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పథకాలపై వీడియో కాన్ఫరెన్సు మినహా సమీక్ష నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరాలూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉందట. అందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించడంలో తప్పేమీ లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారట