YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యవసాయం లాభ సాటిగా వుండాలంటే..?

వ్యవసాయం లాభ సాటిగా వుండాలంటే..?

వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు – సుస్థిర వ్యవసాయానికి పరిష్కార మార్గాలు అనే ప్రధాన విషయంపైన హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ ఆవరణలో ఫోరం ఫర్‌ ఫార్మర్స్‌ చైర్మన్‌ టి.జి.వి. కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిధిగా కేరళ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా|| డబ్ల్యూ. రామ పుల్లారెడ్డి, ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ టి.విజయకుమార్‌ పాల్గొన్నారు.ఈ చర్చలో ఆచార్య ఎన్‌.జి. రంగా విశ్వవిద్యాలయ విశ్రాంత డీన్‌ డా|| ఎన్‌. శ్రీరాంరెడ్డి (వైస్‌ చైర్మన్‌, ఫోరం ఫర్‌ ఫార్మర్స్‌), డా|| ఇ.ఎ.యస్‌. సిద్ధిఖ్‌, డా|| ప్రవీణ్‌ రావు, డా|| ఎల్లారెడ్డి, డా|| ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డా|| పి. యస్‌.యమ్‌.రావు, పి. నాగార్జున, డా||కె. కరీముల్లా, పాలాది మోహనయ్య, డా|| డి. నరసింహారెడ్డి, డా|| బి. యర్రంరాజు వంటి వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు. 
ఈ సమావేశంలో వ్యవసాయ రంగ సుస్థిరతకు, అభివృద్ధికి సూచించిన కొన్ని ముఖ్య పరిష్కార మార్గాలు. 


1 గ్రామ స్థాయిలోనే రైతులు పంటల ప్రణాళికలు రూపొందించే వ్యవస్థ ఏర్పాటు. . ఊరు దాటి పోయిన వ్యవసాయాన్ని తిరిగి ఊరికి తీసుకురావాలి. 
2 రైతులు తమకు కావల్సిన నాణ్యమైన విత్తనాన్ని తామే తయారు చేసుకోవాలి. 
3 కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. (రైల్వే బడ్జెట్‌ మాదిరిగా) 
4 అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయానికి 60 శాతం దాకా వుంటే మన దేశంలో 2-4 శాతం మాత్రమే వుంది. సబ్సిడీలు పెంచుతూ ఎరువుల్లో కానీ, మిగతా సబ్సిడీలు నేరుగా రైతుకు చెందేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 
5 కొత్త వంగడాలు, ఆధునిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులో వుండాలి. అన్ని పంటలకు మద్దత్తు ధరలు ప్రకటన మరియు ప్రతికూల పరిస్థితులలో సహాయం అందించాలి. గ్రామ స్థాయిలో రైతులు సంఘటితమై సమస్యలు పరిష్కరించుకునే ఏర్పాటు రావాలి. 
6 రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాలు వుండే వ్యవస్థ ఏర్పాటు జరగాలి. 
7 పెద్ద గ్రామాల పరిధిలో నిల్వ చేసుకొనే గోదాములు, వాటి ద్వారా మూడు నెలలు వడ్డీ లేని రుణాలు పొందే వ్యవస్థను పెంపొందించాలి. 
8 రైతుల పొలాల్లో ప్రదర్శనా క్షేతాలను ఏర్పాటు చేసి రైతుల్లో వివిధ వ్యవసాయ విధానాలు ( ఇన్‌ ఆర్గనిక్‌, ఆర్గనిక్‌, నేచురల్‌ వ్యవసాయ పద్ధతులు) వాటి వల్ల చేకూరే లాభాలు తెలియచేయాలి. 
9 సన్న చిన్న కారు రైతుకు ఉత్పత్తిలో ఖర్చు తగ్గే యంత్ర పరికరాలు మండల స్థాయిలో అందుబాటులో వుండే వ్యవస్థ మరియు ఆధునిక యంత్రీకరణకు తగిన పరిశోధనలు – ప్రత్యేకించి సన్న చిన్నకారు రైతులకు. 
10 పంట కోత అనంతరం జరిగే నష్టాలు అధిగమించేందుకు తగిన పరిశోధనకై ప్రత్యేక నిధులు కేటాయించాలి. 
11 రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాల ధరలు అధికంగా వుండడమే గాక నాణ్యత కొరవైంది. రాయితీ పోగా ఆదే ధరతో మార్కెట్‌లో ఈ పరికరాలు లభిస్తున్నాయి. కాబట్టి నేరుగా రైతుకే రాయితీ ఇవ్వాలి. 
12 మండల స్థాయిలో భూసార పరీక్షల కేంద్రాలు లేదా చౌక ధరలో భూసార పరీక్ష కిట్టుల ఏర్పాటు చేయాలి. 
13 గ్రామ స్థాయిలో భీమా కాకుండా . ఆధునిక సెటిలైట్‌ టెక్నాలజీ ఉపయోగించి రైతు స్థాయిలో రైతు వారిగా పంటకు భీమా. 
14 కౌలురైతుకు పంట రుణాలు సులభతరం చెయ్యడానికి టెనాన్సి  చట్టంలో వున్న అడ్డంకులు తొలగించాలి. 
15 వడ్డీ లేని రుణాలను ఒక లక్ష నుండి రెండు లక్షలకు పావలా వడ్డీపై ఇచ్చే రుణాలను ఐదు లక్షలకు పెంచాలి.  
16 ప్రకటించిన కరువు మండలాల్లో రుణాలు రీ-షెడ్యూలు చేసి వడ్డీని మాఫీ చేయాలి. 
17 మండల స్థాయి వ్యవసాయాధికారులు 10 శాతం సమయం పొలాల్లో పని చేసి 90 శాతం పాటు కార్యాలయాల్లో వుంటున్నారు. అది 90 శాతం పొలాల్లో, 10 శాతం ఆఫీసుల్లో వుండే మాదిరిగా గ్లోబల్‌ పొజిషన్‌ సిష్టమ్‌ ద్వారా పై అధికారుల నిఘా వీరిపైన వుండాలి. వీరికి అదనపు పనులు అప్పచెప్పకుండా విస్తరణ పనులకు మాత్రమే పరిమితం చెయ్యాలి. 
18 మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారుల పనితీరుపై సోషల్‌ ఆడిట్‌ జరగాలి. 
19 రైతుల భూములు కంప్యూటరీ కరణ జరిగింది కనక క్రెడిట్‌ కార్డు విధానంలో సులభంగా పంట రుణాలు అందే ఏర్పాటు జరగాలి. 
20 రాష్ట్రంలో విడివిడిగా 15 దాకా మంత్రిత్వ శాఖలున్నాయి. ఈ శాఖల మధ్య మెరుగైన సమస్వయానికి నోడల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 
21 పట్టణాల్లో వుండే వసతులు గ్రామాల్లో కల్పించాలి. 
22 మార్కెటింగ్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులు వెంటనే తీసుకురావాలి. 
23 పంట పండించే ప్రాంతంలోనే అగ్రో ప్రొసెసింగ్‌ అక్కడ పండే పంటల నుండి విలువైన ఉత్పత్తుల తయారీ, మార్కెట్‌లో కొనుగోలు పూర్తయిన వెంటనే జాప్యంలేకుండా చెల్లింపులు. 
24 మండల స్థాయిలో అగ్రోసేవా కేంద్రాలు మరియు అగ్రో క్లినిక్‌లు. 
 25 పట్టణ ఆస్తి తాకట్టు అడగకుండా రూరల్‌ స్టోరేజ్‌ గోదాముల కట్టడానికి కానీ, లేదా మరి ఏ ఇతర వ్యవసాయ సంబంధిత కట్టడాలకు వ్యవసాయ భూములను తాకట్టుగా తీసుకోవాలి. 
26 విధానాలపైన కాలక్రమేణ పునశ్చరణ జరగాలి. వర్షపు నీటి వినియోగం భూగర్భ జలాలు పెంపుదల మరియు సంరక్షణ, అంతర రాష్ట్ర నీటి వివాదాలు, వ్యవసాయ దారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, గ్రామీణ రుణాలు మరియు పెట్టుబడులు. 
27 ఏ విధమైన ఆంక్షలు, ఆటంకాలు లేకుండా దేశమంతటా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనే సదుపాయం. 

28 వ్యవసాయానికి బడ్జెట్‌ పెంచాలి. అరవై శాతానికి పైగా ప్రజలకు ఆధారమైన రంగానికి కేవలం 2 శాతం బడ్జెట్‌ నిరాశాజనకం, అవసరాలకు తగిన విధంగా పెంచాలి. 
 29 రాష్ట్ర బడ్డెట్‌ తయారీలో వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ దారుల వేదికలు ఆర్థిక వేత్తలు మరియు విశ్లేషకులను పరిగణలోనికి తీసుకొని సంప్రతింపులు జరిపి, అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలోపు గా పూర్తి చేయాలి. 
30 గత సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల వినియోగం మరియు ఫలితాల పునశ్చరణ వుండాలి. 
31 రాష్ట్ర బడ్జెట్‌లో విపత్తుల నివారణ ఫండును ఏర్పరచి నిధులు కేటాయింపు జరగాలి. 

Related Posts