YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు సుప్రీం నో

యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు సుప్రీం నో

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

కాంగ్రెస్, టీడీపీ, ఆప్ సహా 21 ప్రతిపక్ష పార్టీలకు సుప్రీంకోర్టు ఈరోజు షాక్ ఇచ్చింది. 50 శాతం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.  50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని గతంలో ప్రతిపక్షాలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన ధర్మాసనం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ యంత్రాలను ర్యాండమ్ గా లెక్కించాలని ఈసీని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీం మెట్లు ఎక్కాయి.50 శాతం వివిప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే కనీసం వారం రోజులు పడుతుందని ఎలక్షన్ కమిషన్ (ఇ.సి.) కోర్టుకు తెలియజేసింది. దీనితో విపక్షాల అభ్యర్థనను కోర్టు త్రోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును మార్చే ఉద్దేశ్యం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  

సుప్రీం తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.  మంగళవారం అయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  ఇప్పటితో తమ పోరాటం ఆగదని స్పష్టం చేసారు.  ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అనేది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. 21 పార్టీల నేతలంతా కలసి మళ్లీ ఈసీని కలుస్తామని అన్నారు.  గతంలో బ్యాలెట్ విధానంలో 24 గంటల్లో లెక్కింపు పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందని ఈసీ చెబుతోందని.. సమయం కంటే పారదర్శకత ముఖ్యమన్న విషయం ఈసీ గుర్తించాలని అయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లలో ఓట్ల మధ్య తేడా ఉంటే.. నియోజవర్గం మొత్తం స్లిప్పులన్నీ లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related Posts