యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొంతమంది వైసీపీ నాయకులు సీఎం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకూడదు అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పొలవరాన్ని ఎందుకు పరిశీలించకూడదని టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ ప్రశ్నించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇది ఓటర్ల మీద ప్రభావితం చేసే అంశమేమి కాదు. ఎన్నికల కోడ్ ఉన్న పనులు పరిశీలించి అధికారుల్ని అదేశించే హక్కు ఉంది. ఇప్పుడున్నది కేర్ టెకర్ గవర్నమెంట్ కాదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి సమీక్షించే హక్కు ఉందని అయన అన్నారు. వైసీపీ నాయకులు అబివృద్ది జరగకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తామని జగన్ అంటున్నారు అంటే రాజధానిని తరలించే ఆలోచనలో ఉన్నట్టేగా. రౌడీ నేపథ్యం ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. మంచినీరు ,పశుగ్రాసం మీద కూడా కాబినెట్ సమావేశం జరగకూడదు అని అడ్డుపడుతున్నారు. వేసవి ఎండలు దృష్టిలో పెట్టుకొని ప్రజల సమస్యలపై సమావేశం ఎందుకు పెట్టకూడదని అడిగారు. తెలంగాణాలో వర్తించని ఎన్నికల కోడ్ ఆంద్రప్రదేశ్ కు ఎందుకు వర్తిస్తుంది. ప్రధాని మోడీ కి ఆంద్రప్రదేశ్ పై ఎందుకంత కక్ష. ఏదైనా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాకపోతే అబివృద్ది కుంటుపడటం ఖాయమని అయన అన్నారు.