యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ సమావేశాలను చక్కగా నిర్వహించగలిగాం. నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం సమావేశాలను నిర్వహించాం. ఏపీ విభజన తర్వాత మోడీ కామెంట్లు కరెక్ట్ కాదని ఏపీ శాసనసభాధిపతి కోడెల శివస్రసాద రావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. విభజన చేసింది కాంగ్రెస్ అయితే.. సహకరించింది బీజేపీ. ఒకరు పెద్దమ్మ, మరొకరు చిన్నమ్మ అని చెప్పుకున్నారు. విభజన వద్దని నాడు బీజేపీ చెప్పి ఉంటే విభజన జరిగేదే కాదని అయన అన్నారు. విభజన సమస్యల పరిష్కారం విషయంలో అప్పటి అధికార-ప్రతిపక్షాలకి ఎంత బాధ్యత ఉందో ఇప్పటి వారికీ అంతే బాధ్యత ఉంది. మోడీ-బీజేపీ విభజన సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకోలేరు. తెలుగు వాళ్ల గురించి అవమానించే విధంగా మాట్లాడ్డం సరికాదని అన్నారు. ఒడిస్సాలో ఫొని తుపాను వస్తే రూ. వేయి కోట్లిచ్చారు. కానీ తిత్లీ తుపాను గురించి ఇప్పటికీ మాట్లాడ్డం లేదు. పక్క రాష్ట్రాలకు ఇస్తున్న అనుమతులను ఏపీలో ఎందుకు ఇవ్వడం లేదు. పోలవరంలో నిరంతరం సమీక్ష చేయకపోవడం వల్ల.. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్ల పోలవరం నిర్మాణం జాప్యం అవుతోంని అన్నరు. కేంద్రం వల్లే పోలవరం నుంచి ఈ సీజన్లో నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. బలగాలు సరిగా రాలేదని సీఈఓ అన్నారు. నాపై అందుకే దాడి జరిగింది.ఓట్ల తొలగింపు విషయంలో తెలంగాణ సీఈఓ సారీ చెప్పారు. సీఎస్ వ్యవహరంపై నేను మాట్లాడను. మీడియాలో వచ్చిన విషయాలే నాకు తెలుసు. సీఎస్ ఎపిసోడులో జరుగుతోన్న విషయాలు కరెక్ట్ కాదని అయన అన్నారు..