YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతి శుక్రవారం వికలాంగులకు బోర్డు పరీక్షలు

 ప్రతి శుక్రవారం వికలాంగులకు బోర్డు పరీక్షలు

కర్నూలు: జిల్లాలోని వికలాంగులకు మీసేవా  ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేసే క్రమంలో సదరం డిజిటిలేషన్ ప్రక్రియ ను సమర్ధవతంగా చేపటాలని  జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబరులో వైద్య ఆరోగ్యశాఖ, వికలాంగుల సంక్షేమమం, డిఆర్ డిఎ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధృవీకరణ పత్రాల నమోదు, మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఆగస్టు 2018 నుండి ఇప్పటి వరకు మీ సేవా ద్వారా  3,974 మంది నమెదు చేసుకోగా ఇందులో 2,783 మంది అర్హత పత్రాల పొందారని తెలిపారు. 1,191 మంది వికలాంగుల ధరఖస్తుల వివిధ కారణాలతో తిరష్కరించబడడ్డాయని  పేర్కొన్నారు. ఎవరైనా మీ కోసం ద్వారా రసీదు పొంది ఆసుపత్రికి హాజరు కాని వారు ప్రతి శుక్రవారం ఆయా మెడికల్  బోర్డు లో హాజరు కావచ్చునని కలెక్టర్ తెలిపారు. సదరం ధృవీకరణ పత్రాలు మంజూరు చర్యలు గైకోనాలన్నారు. నంద్యాల ప్రాంతంలో ఆసుపత్రికి గైర్హాజరైన వారికి తిరిగి అవకాశం కల్పించాలలని అదేశించారు. డిమైండ్ ఫౌండెషన్ ఆధ్వర్యంలో గోనెగండ మండలంకు చెందిన బోయ లక్షణ అనే వికలాంగునికి జీవనోపాధి కొరకు జిల్లా కలెక్టర్ చేతుల మీదగా కుట్టు మిషన్ ను పంపిణీ చేసారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి  సూపరింటెండెంటు డా.చంద్రశేఖరు, ఎడి  వికలాంగుల సంక్షేమ శాఖ భాస్కర రెడ్డి, సెట్కూరు సిఇఓ ఆదినారాయణ , డి ఆర్ డి ఎ ఎపియం పుణ్యవతి, సదరం టెక్నికల్ అసిస్టెంటు  సుబ్రమణ్యం , సూపరింటెండెంటు విక్టరు బాబు, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Related Posts