టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో స్పీడ్ పెంచిన కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కూటమిపై నిశితంగా చర్చించారు. అయితే ఈనెల 13న కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు స్టాలిన్‌కు ఫోన్ భేటీ గురించి కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అయితే కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్, స్టాలిన్ భేటీపై అనుమానమేనని తెలుస్తోంది. ఈనెల 13న కాకుండా త్వరలోనే స్టాలిన్-కేసీఆర్‌ల భేటీ జరుగుతుందని సమాచారం. కాగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.