YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పద్మ'శ్రీ'దేవికి పరాభవం

Highlights

  • దౌత్య అధికారుల అవగాహన రాహిత్యం
  • వయస్సు ప్రస్థావనలో లోపాలు
  • కోట్లు దోచుకునే వారికిచ్చే రక్షణ వీరికెందుకు ఇవ్ళరు..
  • నేరస్థులకు ఇచ్చే సెక్యురిటీకీ కూడా 'పద్మ'లకు లేదా..?
పద్మ'శ్రీ'దేవికి పరాభవం

భారతీయులు గర్వించే అవార్డు ఇచ్చి సత్కరించుకున్న ఓ 'పద్మశ్రీ' విషయంలో భారత దౌత్య అధికారుల వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సగౌరవంగా అందించే అవార్డు గ్రహీతలకు విదేశాలలో ఎదురయ్యే పరాభవాలకు బాధ్యత ఎవరిది. అసలు బాధ్యత లేదనుకోవడం వల్లనే పద్మ 'శ్రీ' దేవి పార్థీవకాయం భారత్ రావడానికి 70 గంటల సమయం పట్టింది.

దుబాయ్‌ అధికారుల తప్పిదాలు..
: యావత్‌ భారతావని అతిలోక సుందరిగా ఆరాధించే శ్రీదేవి అకాల మరణంపై దుబాయ్‌ అధికారుల వరుస తప్పిదాలు ఇవి. 
తాను బసచేసిన జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో ఫిబ్రవరి 24 రాత్రి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయారని అక్కడి పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రాసిక్యూటర్‌లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు జారీ అయిన డెత్‌, ఎంబామింగ్‌ సర్టిఫికేట్లలో శ్రీదేవి వివరాలను ఒక్కోచోట ఒక్కోలా పేర్కొనడం గమనార్హం. గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్‌ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునే వీలులేదు.

మరి అంత పకడ్బందీగా సాగే వ్యవహారాల్లో తప్పులు చోటు చేసుకోవడం, అది కూడా పద్మ'శ్రీ'దేవి లాంటి  విషయంలో జరగడం అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి. భారతీయ దౌత్య అధికారులకు ఈ విషయాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం క్షమార్హం కాదు.

శ్రీదేవి వయసెంత?
శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌ అలియాస్‌ శ్రీదేవి 1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించారు. చనిపోయేనాటికి ఆమె వయసు 54 ఏళ్లపైమాటే. కానీ యూఏఈ ఆరోగ్య శాఖ జారీచేసిన డెత్‌ సర్టిఫికేట్‌లో శ్రీదేవి వయసు 53 ఏళ్లుగా పేర్కొన్నారు. అదే ఎంబామింగ్‌ ప్రక్రియకు సంబంధించి అదే శాఖ జారీ చేసిన మరో ఆదేశాల్లో మృతురాలి వయసును 52 ఏళ్లని రాశారు. అందరికీ తెలిసినట్లు ఆమె వయసు 54 ఏళ్లు కాకుండా పాస్‌పోర్టులో మరోలా ఉందనుకున్నా, రెండు సర్టిఫికేట్లలోనూ దానినే పేర్కొనాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోచోట ఒక్కోలా వయసును పేర్కొనడం ఖచ్చితంగా పొరపాటే. 
ఫిబ్రవరి 27న యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎంబామింగ్‌ సర్టిఫికేట్‌ లో (వయసు52గా పేర్కొన్నారు)
ఫిబ్రవరి 26న జారీ అయిన శ్రీదేవి డెత్‌ సర్టిఫికేట్‌ (వయసు 53గా రాశారు)
ఆ మూడురోజులూ శ్రీదేవి మృతదేహం అక్కడే..
యూఏఈ ఆరోగ్య శాఖ భవనంలో పోస్ట్‌మార్టం అనంతరం " పనివారి మృతదేహాలను ఎక్కడైతే భద్రపరుస్తారో అదే చోట" పద్మ'శ్రీ'దేవి పార్థీవదేహాన్ని కూడా మూడు రోజులపాటు ఉంచారు. మంగళవారం సాయంత్రానికి దర్యాప్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్‌ చేసి విమానాశ్రయానికి తరలించారు. నిజానికి దుబాయ్‌ అధికార వర్గాలు ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయడం అరుదు. అయితే శ్రీదేవి మరణం, ఆమె భౌతికాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యాన్ని వివరిస్తూ భారత్‌లోని యూఏఈ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరి ఇదే సమయంలో భారత దౌత్యవేత్తలు చేసిన పని ఏమిటనేది ప్రశ్న.
రక్షణ చర్యలు ఏవి..?
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఏపాటిది. వారిని కేంద్రం అవార్డులు ఇచ్చిన తరువాత గాలికి వదిలేస్తున్నట్లు తాజా సంఘటనలు ఋజువు చేస్తున్నాయి.
వనజీవి రామయ్యకు ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పిలుపు వచ్చింది. కానీ ఖర్చులు ఇతరులుభరించారు.

కోట్లు దోచుకునే వారికిచ్చే రక్షణ వీరికెందుకు ఇవ్వరు..? 
నేరస్థులకు ఇచ్చే కనీస సెక్యురిటీకీ కూడా 'పద్మ'లకు అర్హత లేదా..?

ఇక్కడ ప్రజాప్రతినిధుల ముసుగులో కోట్లు దోచుకునే వారికిచ్చే రక్షణలో ఒక్కశాతం రక్షణ లేదంటే... మన దేశ దౌర్భాగ్యం వైపు ఈ సందర్భంగా ప్రపంచదృష్టి పడింది.
దేశ ప్రజాప్రతినిధులలో 82% మంది వివిధ కేసులలో నిందితులుగా ఉన్నవారే... వారి రక్షణ చర్యలకై కేంద్రం తన బడ్జెటులో 9శాతం వివిధ రూపాలలో ఖర్చు చేస్తుంది.
దౌత్య అధికారులు
అనుభవలేమితో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న తీరు అమానవీయం.
పద్మ'శ్రీ'దేవి ఉదంతం ఎంత దయనీయంగా ఉందో తెలిసింది.
తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళుతున్న అభాగ్యుల దయానీయమైన బడుగు జీవులకు ఉండే రక్షణ, వారికి జరుగుతున్న దుస్థితి గురించి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన తరుణం ఇది.
                                                                             - అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన 

Related Posts