తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో జరిగిన సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్‌తో సమావేశం వివరాలను విజయన్ తాజాగా వెల్లడించారు. కేసీఆర్‌తో భేటీలో దేశ రాజకీయ పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించాం. బీజేపీ, కాంగ్రెస్ కూటమిలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలకంగా మారుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి చర్చలు జరుపుతాం. ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని విజయన్ పేర్కొన్నారు.రళ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. సోమవారం (మే 6) తిరువనంతపురం విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్... అక్కడ నుంచి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ అధికారులు కేసీఆర్‌కు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా తిరువనంతపురానికి వెళ్లిన కేసీఆర్.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. కేరళ పర్యటన అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామితో ప్రత్యేకంగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తిరువనంతపురం విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.