మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైసీపీలో చేరబోతున్నారట. పార్టీలో ఉండవల్లి వంటి సీనియర్ నేతలు ఉండాలని జగన్ భావిస్తున్నారట.. ఆయనే స్వయంగా అరుణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారట. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వస్తే.. ఈ మాజీ ఎంపీకి మంత్రివర్గంలో అవకాశం కూడా కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చేశారట. కొద్దిరోజులుగా ఉండవల్లిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలో చేరిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. తాను వైసీపీ చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. వైసీపీలో చాలామంది సీనియర్ నేతలు, అనుభవజ్ఞులు, ఉన్నారంటున్నారు అరుణ్‌కుమార్. సోషల్ మీడియాలో ఏవేవో పెడుతుంటారు.. వాటిని నమ్మొద్దంటున్నారు. తాను రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని.. కంపల్సరీ రిటైర్మెంట్ కాదన్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ అంటే పనిష్మెంట్.. వాలంటరీ రిటైర్మెంట్ అంటే.. సింపుల్‌గా తనకు నచ్చిన పని చేస్తున్నానని.. అందే అందరితో మాట్లాడటమన్నారు