YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో సిలబస్ తగ్గింపు దిశగా అడుగులు

ఏపీలో సిలబస్ తగ్గింపు దిశగా అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. అధిక సిలబస్‌తో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఊరట కల్పించే దిశగా ఏపీ పాఠశాల విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను 50 శాతానికి తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మే రెండోవారం నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు సేకరించనున్నారు. కొత్త పాఠ్య ప్రణాళిక 2020-21 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 1 నుంచి 10 వరకు అన్ని తరగతుల సిలబస్‌కు ఈ మార్పు వర్తించనుంది. సిలబస్ తగ్గించడం వల్ల విద్యార్థులు బేసిక్ కాన్సెప్ట్స్‌ను, ప్రాక్టికల్ అప్లికేషన్స్‌ను సులువుగా అర్థం చేసుకుంటారు. అనవసరమైన సమాచారంతో ఒత్తిడికి గురికాకుండా వ్యక్తిత్వ లక్షణాలకు మెరుగు పరచుకునే వీలుంటుంది. రిపీటెడ్‌గా వచ్చే పాఠ్యాశాలనున సిలబస్ నుంచి తొలగిస్తారు. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం.. సర్వేకు సంబంధించిన క్వశ్చనీర్‌ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్ ద్వారా చేపట్టే ఈ సర్వేలో సమాజంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ప్రొఫెసర్స్, ఇంజినీర్స్, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి సూచనలు సేకరించనున్నారు. మొత్తంగా కనీసం 50 వేల మంది అభిప్రాయాలు సేకరించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రశ్నలకు జవాబులు ఇచ్చే ముందు.. సంబంధిత వ్యక్తులు పుస్తకాలను లేదా నిర్ణీత చాప్టర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు. వారే సిలబస్ చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సిలబస్‌లో ఎలాంటి పాఠ్యాంశాలను ఉంచాలో.. ఎలాంటి పాఠ్యాంశాలను ఉంచకూడదో లాంటి అంశాలతోపాటు.. మార్పులు చేయాల్సిన పాఠ్యాంశాలను కూడా వారే నిర్ణయిస్తారు.దాదాపు నెలపాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. సర్వే నివేదిక ఆధారంగా.. సిలబస్‌ తగ్గింపుపై నిపుణులతో విద్యాశాఖ అధికారులు సమీక్ష జరపనున్నారు. కొత్త పాఠ్యప్రణాళికలో శారీరక విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్), ప్రయోగాత్మక అభ్యాసనం (ప్రాక్టికల్ లెర్నింగ్)తోపాటు విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Related Posts