YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ సీఎం అయితే.... రాజధాని మారుతుందా

జగన్ సీఎం అయితే.... రాజధాని మారుతుందా

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ సంగతి పక్కన పెడితే...వైసీపీలో మాత్రం గెలుపు ధీమా పక్కాగా కనిపిస్తోంది. అందుకే జగన్ కొంతమంది నాయకులకు కేబినెట్ ఆఫర్లు కూడా ఇచ్చేస్తున్నారు జగన్. చాలావరకు సర్వేలు కూడా ఏపీలో గెలుపు వైసీపీదేనని అని తెల్చేశాయి. దీంతో ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన వైసీపీ నాయకుల హడావుడి ఎక్కువైపోతుంది. జగన్ సీఎం అయితే ఏపీ రాజధాని అమరావతి కాదన్నట్లు ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒంగోలు నేతలు... దోనకొండపై దృష్టి పెట్టారు. దోనకొండలో భూముల కొనుగోళ్లకు తెరలేపారు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీ నాయకులు,రియల్‌ ఎస్టేట్‌ దళారుల తాకిడి పెరిగింది. బేరసారాలు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంత వాసులతో పాటు విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా భూములను పరిశీలించి కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలలోనూ స్పల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ గెలిచి జగన్‌ సీఎం అవుతారన్న నమ్ముతున్న వారంతా దోనకొండవైపు చూస్తున్నారు. 2014 ఎన్నికల ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పాటైన నవ్యాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందన్న చర్చ జోరుగా జరిగింది. అప్పట్లో ఎక్కడ రాజధాని నిర్మితమవుతుందనే విషయమే ఎవరికీ అర్థం కాలేదు. రాయలసీమలో రాజధాని వుండాలని కొందరంటే.. విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని ఉండాలని మరికొందరు అన్నారు. అవేవీ కాదు ప్రకాశం జిల్లా దోనకొండ అని మరో ప్రతిపాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు ఇవేవి కాదని నవ్యాంధ్రలో టీడీపీ ప్రభుత్వంయ ఏర్పాటైన తర్వాత అనూహ్యంగా గుంటూరు జిల్లా తాడేపల్లికి సమీపంలో రాజధాని ఏర్పాటు పక్రియ ప్రారంభించింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారాన్ని చేపడితే దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. కడప జిల్లాకు చెందిన వారు, ప్రత్యేకించి వైసీపీలో కొందరు ముఖ్యనాయకులు అప్పట్లో ఆప్రాంతంలో ముందస్తుగానే భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ అధికారంలోకి రావడంతే రాజధాని అమరావతిలో నిర్మించారు. ఇప్పుడు ... మరోసారి ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తారన్న వార్తలు రానుండటంతో... వైసీపీ నేతలంతా అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోలో కూడా అమరావతి కోసం ఒక్క ముక్క కూడా చెప్పలేదు జగన్. దీంతో జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని ఏర్పాటులో మార్పులు చోటు చేసుకుంటాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ సీఎం అవుతారన్న ధీమాతోనే దోనకొండలో భూముల కొనుగోళ్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు బేరాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ గెలిస్తే మాత్రం దోనకొండ ప్రాంతం అభివృద్ధి చెందడం ఖాయమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకే ... ఫలితాలకు ముందే ఆ ప్రాంతంలో భూముల కొనుగోళ్లను మొదలు పెట్టేశారు

Related Posts