యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కడప జిల్లా రాజంపేట ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రోల్లమడుగు అటవీ ప్రాంతంలో 3 రోజుల క్రితం అడవిలో కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా దాదాపు 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారస పడడంతో ఫారెస్ట్ పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో పోలీసులను చూసిన స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఘటనలో దాదాపు 54 మంది పారిపోగా తమిళనాడుకు చెందిన 6 మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. పట్టుబడ్డ స్మగ్లర్లలో ఒకరు బీటెక్ విద్యార్థి అని తెలిసింది. స్మగ్లింగ్ లాభసాటిగా ఉండడంతో చదువుకునే యువకులు సైతం అడవుల బాట పడుతున్నట్లు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. అక్రమ రవాణా చేయడం కోసం సిద్దంగా వుంచిన ఏ.గ్రేడు రకానికి చెందిన కోటి రూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలను స్మగ్లర్ల నుండి ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం డంపు తో పాటు 10 గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు