YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరానికి అడ్డు పడుతున్నారు

పోలవరానికి అడ్డు పడుతున్నారు

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

పోలవరం పనులన్నీ వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి క్షే త్ర స్ధాయి పర్యటన చేసారు. 
70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అప్పర్ కాపర్, లోయర్ కాపర్ డాం నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. సుమారు 500 మంది ఇంజినీర్లు డాం సైట్లో పనిచేస్తున్నారు. కొన్ని వందల మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. నిపుణులు, ఇంజినీర్లు సమక్షంలో పనులు సాగుతున్నాయి. భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పరు. వైఎస్ హయాంలో లబ్ది పొందిన వారంతా అక్కడ టీఆరెస్ లో ఇక్కడ వైకాపా లో చేరారని అన్నారు. ప్రమాణ స్వీకారం చేయాలంటే 7 ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలపాలన్నారు. దేవాలయాలు మునిగిపోతాయని చేబుతున్న కేసీఆర్ ఆనాడు ఏంచేశారు. ఏదో రకంగా పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. కేసీఆర్, కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్ లు వేసినప్పుడు కేవీపీ ఎందుకు స్పందించలేదు. కొంతమంది రాజమండ్రి కొట్టుకు పోతుందని అసత్యాలు చెబుతున్నారు. వైకాపాపై ప్రేమ ఉంటే పార్టీలో చేరండి కానీ ఇలా ప్రజలను పక్కదారి పట్టించొద్దు. ఒక్కసారి కూడా డాం చూడకుండానే సాక్షిలో అసత్యాలు, అవస్తవాలు ప్రచారం చేస్తున్నారు.  వైస్ పోలవరం కట్టారని చెబుతున్నారు. మట్టి పనులు చేసి కోట్లు దండుకున్నారు.  జగన్ కు లబ్ది చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారు. పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నించారని అన్నారు. ఆ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకు పైగా ఆగిపోయాయి. జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలాడుతున్నారు. కోట్ల మంది ప్రజలు, రైతుల గుండె చప్పుడు పోలవరం
అనవసరంగా ప్రాజెక్టు జోలికి రావొద్దు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా... పోలవరం అంత వేగంగా ఎక్కడ పనులు సాగడంలేదని అన్నారు. 44 వేల కోట్ల సంపద ఇవాళ పట్టిసీమ ద్వారా జిల్లాకు అందింది. జగన్ కి పట్టిన శని విజయసాయి రెడ్డి. 23న వచ్చే ఫలితాలతో వైకాపా దుకాణం మూతపడుతుంది. పోలవరానికి రావలసిన నిధులను రేపు కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి సాధించుకుంటామని అన్నారు. జాతీయ ప్రాజెక్టును ఒక్కసారైనా ప్రధాని, ప్రతిపక్ష నేత, విజయసాయిరెడ్డి వచ్చి చూసారా అని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ దర్శకత్వంలో అందరూ నాటకాలాడుతున్నారు. పోలవరానికి సంబంధించి ఎవరికి ఏ సమాచారం కావాలన్నా ప్రాజెక్టు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రాణాలకు తెగించి కార్మికులు పనులు చేస్తుంటే రాళ్లేయడం ఎంతవరకు సబబని అడిగారు. పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోండని సూచించారు. 

Related Posts