Highlights
- సీబీఎస్‌ఈ సడలింపు
పదో తరగతి విద్యార్థులకు అర్హత పాస్ మార్కు ల విషయంలో సీబీఎస్‌ఈ సడలింపునిచ్చింది.
వచ్చేవారంలో బోర్డు పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు థియరీ, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లోనూ కలిపి మొత్తం 33 శాతం మార్కులు తెచ్చుకుంటే పాసైనట్లుగా ప్రకటించనున్నారు. ఈ సడలింపు ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు మాత్ర మేనని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విద్యార్థులు విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవలసి అవసరం లేదని సీబీఎస్‌ఈ పేర్కొంది.