యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు రికార్డులను పరిశీలించారు. బుధవారం ఉదయమే బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను పరిశీలించారు. . మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షికి సినిమాకు దిల్ రాజు సహ నిర్మాత గా వ్యవహరించారు. దీంతో ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే దిల్ రాజు తన కార్యాలయానికి వచ్చారు.