యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో కర్ణాటక చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఎస్ఎల్ఎన్ కాలనీకి చెందిన ఓబుళేసు, సోమప్ప అనే భవన నిర్మాణ కార్మికులు పాత ప్రయాణ ప్రాంగణం నుంచి తమ కాలనీకి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు.అక్కడ ద్విచక్ర వాహనం, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గుర్తించిన స్థానికులు చికిత్స కోసం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా సోమప్ప మార్గమధ్యంలో మృతి చెందాడు.