యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన ఎన్నికల కమిషన్, ప్రజా సమస్యల పరిష్కానికి కూడా అడ్డుపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన ఎన్నికల కమిషన్ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో కరవుతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుంటే ఉమశమన చర్యలపై నిర్ణయం తీసుకోడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంపై ఆంక్షలు పెట్టడం ఆక్షేపణీయమన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నా పట్టించుకోని సీఈసీ, భాజపాను వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రం ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు. అధికారులు ప్రభుత్వానికి సహకరించి ప్రజాసమస్యలను పరిష్కరించాలని, సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని రామకృష్ణ కోరారు.