YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

తప్పులు..తడబాట్లు

Highlights

  • రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
  • ఇంటర్‌ తొలిరోజు పరీక్షకు 18 వేల మంది గైర్హాజరు
  • తెలుగు 1లో తప్పుల తడకగా పదాలు
  • ఎస్‌ఎంఎస్‌లతో దిద్దుబాటు
  • కొన్ని చోట్ల ప్రశ్న పత్రాలు తారుమారు
  • విద్యార్థుల కోసం టోల్‌ఫ్రీ 18002749868
  • ఏప్రిల్‌ 12న ఇంటర్‌ ఫలితాలు: మంత్రి గంటా
తప్పులు..తడబాట్లు

ప్రశ్నపత్రాల్లో అచ్చుతప్పులు..పేపర్ల తారుమారు..అధికారుల దిద్దుబాటు చర్యల మధ్య రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.

ఇంటర్మీడియెట్‌లో 60 శాతం కంటే తక్కువ హాజరుకలిగిన సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేశారు. దీంతో జిల్లాలో సుమారు 300 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేయలేదు. దీంతో విశాఖ కృష్ణా కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
తెలుగు పేపర్‌-1లో ఒక ప్రశ్నలో 'పొట్టకూడు' అనే పదానికి 'పూట్లకూడు' అని, మరో ప్రశ్నలో 'రూప్‌చంద్‌'కు బదులుగా 'రూపాచంద్‌' అని ముద్రించారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే ఈ అచ్చుతప్పులను గుర్తించిన ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు సెంటర్లలో తెలుగు పరీక్ష రాసే విద్యార్థులకు సంస్కృతం పేపర్‌ ఇవ్వగా...సంస్కృతం పరీక్ష రా సే విద్యార్థులకు తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏలూ రు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి చెందిన కొందరు దివ్యాంగులైన విద్యార్థులకు స్ర్కైబ్‌లను ఏర్పాటు చేయకపోవడంతో సమస్య తలెత్తింది.
తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,423 సెంటర్లలో సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 పరీక్షకు 5,25,998 మంది విద్యార్థులకు గాను 5,07,903 మంది హాజరయ్యారు. 18,095 మంది గైర్హాజరయ్యారు. సంస్కృతం పేపర్‌-1లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదుచేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ ప్రశ్నాపత్రపు సెట్‌ (3)ను బుధవారం ఉదయం విజయవాడలో విడుదల చేసిన తర్వాత రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఇంటర్‌ ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుని ర్యాంకులు, మార్కులకు బదులుగా గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎక్కడైనా సమస్య తలెత్తితే 18002749868 లేదా 0866 2974130కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

సెలైన్‌ బాటిల్‌తోనే పరీక్షకు
తెనాలి చినరావూరులోని నెహ్రూనికేతన్‌ కళాశాలలో జరుగుతున్న పరీక్షా కేందరంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని మహారాణీ కళాశాలలో పరీక్ష రాయడానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన తానాల నందినిని లోపలికి పంపలేదు. ఊరు నుంచి ఆర్టీసీ బస్సు లేటుగా రావడంతో ఆలస్యమైందని విద్యార్థిని ప్రాధేయపడినా అనుమతించ లేదు. అనంతపురం జిల్లా గోరంట్లలోని ఎస్‌వీఆర్‌ కళాశాలలో పరీక్ష రాస్తున్న శ్రావణి అనే విద్యార్థిని అస్వస్థతకు లోనైంది. వైద్యులను రప్పించి సెలైన్‌ ఎక్కించారు. సెలైన్‌ బాటిల్‌ చేతికి పెట్టుకునే శ్రావణి పరీక్ష రాసింది.
ఇంటర్మీడియెట్‌లో 60 శాతం కంటే తక్కువ హాజరుకలిగిన సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేశారు. దీంతో జిల్లాలో సుమారు 300 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేయలేదు. దీంతో విశాఖ కృష్ణా కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

Related Posts