YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఏపీఐసెట్‌-2019 ఫలితాలను బుధవారం (మే 8న) విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మే 15 నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చుఐసెట్ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ మొదటి స్థానంలో నిలిచాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కావ్య శ్రీ, విజయవాడకు చెందిన శివసాయి పవన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 
టాప్-10 ర్యాంకర్ల వివరాలు ఇలా-
ర్యాంకు అభ్యర్థి పేరు జిల్లా
1 కారుమూరి నాగసుమంత్‌ గుంటూరు
2 కె.కావ్యశ్రీ తూర్పుగోదావరి
3 ఎన్‌.శివసాయి పవన్‌ విజయవాడ
4 యాగంటి ముని చంద్రారెడ్డి కడప
5 ఒ.భాను ప్రకాశ్‌ చిత్తూరు
6 ఎం.వెంకటనాగేంద్ర విశాఖపట్నం
7 పి.వెంకటలక్ష్మి కిరణ్మయి తూర్పుగోదావరి
8 కె.భానుప్రకాశ్‌రెడ్డి చిత్తూరు
9 ఎ.అఖిల్‌ హైదరాబాద్‌
10 అంబటి సురేందర్‌రెడ్డి కర్నూలు
ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏపీఐసెట్ పరీక్ష నిర్వహించారు. ఎస్వీయూ నిర్వహించిన ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో జరిగింది. ఈ పరీక్షకు 52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 27 ఐసెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం మే 8న ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Posts