యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో పాటు పలు కార్పొరేట్ కంపెనీల ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో... మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 488 పాయింట్లు పతనమై 37,789కి పడిపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
30 స్టాకుల సెన్సెక్స్ లో కేవలం రెండు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. వీటిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.29%), టీసీఎస్ (0.11%) ఉన్నాయి.
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.35%), బజాజ్ ఫైనాన్స్ (-3.22%), టాటా మోటార్స్ (-2.80%), బజాజ్ ఆటో (-2.55%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.53%)