YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాశి ఫలాలు 

Highlights

  • శుభోదయం
  • తేదీ : 01.03.2018
రాశి ఫలాలు 

మేషం .చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చతుర్థంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. కొన్ని వ్యవహారాల‌లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం 

వృషభం..మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయస్థ చంద్ర బలం అనుకూలంగా ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల‌ మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధునం.. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

కర్కాటక..వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

సింహం..మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. ద్వాదశంలో చంద్ర సంచారం యోగించట్లేదు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది

కన్య..శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన చేయడం మంచిది.

తులా..మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దశమంలో చంద్ర సంచారం విశేషంగా యోగిస్తోంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధ‌న మానవద్దు.

వృశ్చికం..స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్ర‌మాలలో పాల్గొంటారు. నవమంలో చంద్రుడు అనుకూలించట్లేదు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ‌ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనస్సు.. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. అష్టమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

మకరం..కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సప్తమంలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. బంధుమిత్రుల వల్ల‌ మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

కుంభం..శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్త య్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. షష్ఠమ స్థానంలో ఉన్న చంద్ర బలం అనుకూలిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృద‌యం పఠించడం మంచిది.

మీనం..మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల‌లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత.

Related Posts