యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. రోహిణికార్తెకు ముందు రోళ్లు పగిలేలా భానుడు భగభగ మండిపోతున్నాడు. జనం ఉదయం తొమ్మిది దాటితే బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రెండు మూడురోజులుగా పలుచోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణతో పోల్చితే ఏపీలోని పలు జిల్లాలో జనం ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు సొసైటీ (ఆర్టీజీఎస్) అంచనా వేసిన విధంగానే రాష్ట్రంలో బుధవారం మూడుచోట్ల పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రత 46.47 డిగ్రీలు ప్రకాశం జిల్లా కురిచేడులో నమోదైంది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో 46.37, నెల్లూరు జిల్లా మన్నాపోలూరులో 46.04, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 46 డిగ్రీలు నమోదైంది. 45 నుంచి 45.9 డిగ్రీల మధ్య 33 చోట్ల, 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య 62 ప్రాంతాల్లో, 43-43.9 డిగ్రీల మధ్య 116 ప్రాంతాల్లో, 42-42.9 డిగ్రీలు 133 ప్రాంతాల్లో, 41-41.9 డిగ్రీల మధ్య 133 ప్రాంతాల్లో, 40 -40.9 డిగ్రీల మధ్య 142 ప్రాంతాల్లో నమోదు అయింది. గురువారం కూడా రాష్ట్రంలో చాలా చోట్ల 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లాల పరిధిలో ఎక్కువ ఎండలు కాస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతోంది. గత కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పగటి పూట నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్టు వడగాల్పులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో రెండు రోజుల పాటు కోస్తాలో వడగాల్పులు తప్పవని విశాఖ వాతారణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. దక్షిణ కోస్తాలో అతితీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పలు పట్టణాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవతాయని తెలిపారు.రంజాన్ మాసం ప్రారంభం కావటంతో ఉపవాస దీక్షల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. దీక్షలో ఉన్న వారు అత్యవసరమైతే తప్పా, బయటకు రావద్దని అన్నారు. దుకాణాలు, ఆఫీసులు, ఇతర సంస్థల్లో విధులు నిర్వర్తించే వారు వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు ఏయిర్ కండిషన్లు, కూలర్లు వంటివి