YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది ?

ఎన్టీఆర్ చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది ?

-  తిప్పరాజు రమేష్  బాబు   మాటల్లో ....
""నేను ఢిల్లీ లో ఉద్యోగం చేసేవాడిని ;; సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ ఇంటికి వచ్చా ;;;""
""జనవరి 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు గారింటికి (రోడ్ నంబర్ 13 , బంజారా హిల్స్ ) వెళ్ళా ;; ఆయన్ని, లక్ష్మి పార్వతిని కలసి చాలా గంటలు గడిపా ;;""

""ఎంతైనా మహా నటుడు కదా ;; ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్నా పైకి నవ్వుతూనే మాతో గడిపారు ""
సాయంత్రం 4 గంటలు అయింది ;; అన్నగారి ఆఖరి కుమారుడు జై శంకర్ కృష్ణ వచ్చి కొంచెం సేపు మాట్లాడి డబ్బులు అడిగి తీసుకెళ్ళాడు ;;

సాయంత్రం 5 గంటలు ;; అన్న గారి ముఖంలో తీవ్ర ఆందోళన ;
సాయంత్రం 6 గంటలు ;; తెలుగు దేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ;; యెన్ . వి. రమణ , శ్రీనివాస రావు అన్నగారి దగ్గరకు వచ్చారు ;;

సాయంత్రం 6.30 నిమిషాలు ;;""ఒక్కసారిగా ;; ఏం బ్రదర్స్ ""
ఏం జరిగింది ;??""
సార్ ;; హై కోర్ట్ లో మనం కేసు ఓడిపోయాం ;; తెలుగు దేశం పార్టీ బాంక్ ఖాతాలు అన్నీ చంద్ర బాబు పార్టీ కే చెందుతాయని ;; బాంకుల్లో మీ సంతకాలు చెల్లవని చీఫ్ జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా నేతృత్వం లోని బెంచ్ తీర్పు చెప్పింది ;;"" అన్నారు ;;

ఖిన్నుడైన అన్నగారు కుర్చీ లోంచి ఒక్కసారిగా లేచి ""దరిద్రులు ;; చండాలులు;; మోసగాళ్ళు ;; పిల్ల నిచ్చి ;; పదవి ఇచ్చి , ఆస్తి ఇచ్చి ఆదరించి , అభిమానించి మంత్రిని చేస్తే ""
శాసనసభ్యుల్ని , ఆస్తుల్ని ;; పార్టీని ;; పార్టీ గుర్తుని ""దొబ్బెసాడు "
అంటూ గట్టిగా అరుస్తూ ;;; భోరు భోరున విలపిస్తూ ;; గుండె బాదుకుంటూ ;;; తన బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు ;;
లోపల గడియ పెట్టేసుకున్నారు ;; లక్ష్మి పార్వతి ;; నేను ;; అశోక్ ఎంత పిలిచినా ;; తలుపు కొట్టినా తలుపు తీయలేదు ;;
రాత్రి 8.00 గంటలకి తలుపు తీసి ;; గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి ""జీవితంలో నమ్మి మోసపోయా "" అంటూ ఏడుస్తూనే ఉన్నారు ;; పాలు ఇస్తే తాగలేదు ;; భోజనం చెయ్యమంటే చెయ్యలేదు ;;

రాత్రి 9 గంతలు ;;; రమేష్ ;; అన్నగారికి ఎక్కిళ్ళు వస్తున్నాయ్ ;; మంచినీళ్ళు ఇస్తే త్రాగడం లేదు ;; అందరూ రండి ;; మంచి నీళ్ళు త్రాగిద్దాం అని లక్ష్మి పార్వతి పిలిస్తే వెళ్లి బ్రతిమిలాడగా ;; బ్రతిమిలాడగా ""గుక్కెడు "" మంచినీళ్ళు త్రాగారు ;;ఏడుపు ఆగలేదు ;; ఎక్కిళ్ళు ఆగలేదు ;; అందరూ వెళ్ళిపొండి అని ఆదేశాలు జారీ చేశారు ;; అందరం బయటకు వచ్చేశాం ;; లక్ష్మి పార్వతి అన్నగారిని ఓదారుస్తోంది ;;

ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు ఆయన ఇంట్లోనే ఉన్నా ;
తర్వాత బయలుదేరి పద్మారావు నగర్ ఇంటికి చేరుకున్నా ;;
నాలో ఆందోళన ;; భయం ;; నిద్ర రావడం లేదు ;;

తెల్లవారున 4 గంటలకి కొంచెం నిద్ర వస్తోంది ;; అప్పుడే నా పెద్ద కూతురు నళిని వచ్చి ""డాడీ"" లక్ష్మి పార్వతి మేడం phone చేశారు ;; లైన్ లో ఉన్నారు "" అని చెప్పింది ;

phone రిసీవర్ అందుకున్నా ;;లక్ష్మి పార్వతి మాటలకు
""హతాసుడిని అయ్యా "" నా నోరు మూగబోయింది ;; మూర్చ వచ్చేట్లు ఉండి కూడా మొహం కడుక్కుని అన్నగారింటికి బయలుదేరా ;

ఆ దృశ్యాన్ని చూడలేకపోయా ;;;
""అన్నా ;; నీ అనురాగం ""
""ఎన్నెన్నో జన్మల బంధం నీదీ -నాదీ""
అనుకుంటూ ;;

విషన్నవదనంతో అక్కడే కుప్పకూలిపోయా ;;
అన్నగారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనసారా ప్రార్ధిస్తూ

  మరి కొన్ని పాత సంగతులు ---

ఎన్టీఆర్ కామాంధుడు , పెళ్లీడుకొచ్చిన మనుమళ్ళు మనవరాళ్లని ఇంట్లో పెట్టుకొని కామంతో కళ్ళుమూసుకొనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు . అసలు ఎన్టీఆర్ లో నైతిక విలువులు సూన్యం . అంతేకాదు ఎన్టీఆర్ అవినీతిపరుడు , ఒకపక్క మద్యనిషేధం అమలులో ఉంటే డిస్టలరీస్ బ్రేవరేజస్ కంపెనీల దగ్గర లంచాలు తీసుకోని మద్యం తయారీకి అనుమతులు ఇచ్చాడు  . మాకు ఎన్టీఆర్ తో అవసరమే లేదు . ఆయనకీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంభంధం లేదు . నన్ను పార్టీ అధ్యక్షుడుగా , ముఖ్యమంత్రిగా పార్టీ సభ్యులు ఎన్నుకొన్నారు . ఎన్టీఆర్ వాదన కోర్టులలో కూడా చెల్లదు , అసలు ఆయనకి మతి చెలిచింది . ఇదీ వెన్నుపోటు అనంతరం చంద్రబాబు ఇండియాటుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు . --- ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు 

గొడ్డుకన్నా హీనం , గాడ్సే కన్నా ఘోరం . నావెనకే ఉండి నమ్మించి వెన్నుపోటు పొడిచాడు . వాడి పేరు తలవటం కూడా నాకిష్టం లేదు . ఇలాంటి హీనుడు ఏ తల్లితండ్రులకి పుట్టకూడదు . తండ్రిని జైల్లో పెట్టించిన ఔరంగజేబు కంటే కూడా ఇతను ఇంకా పెద్దమోసగాడు . మోసమే అతని నైజం . కాంగ్రెస్ లో ఓడిపోయాక నా కూతురిని వెంటపెట్టుకొని వచ్చి కాళ్ళమీద పడితే కరుణించి స్థానమిచ్చాను . అప్పటినుండి గుంటనక్క లాగా ఎదురుచూసి ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు . చరిత్రహీనుడు , కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నన్నే మోసం చేసాడు . తెలుగుప్రజలని తన టక్కుటమారా విద్యలతో మోసం చేస్తాడు . కాబట్టి తెలుగుప్రజలారా ఈ మోసగాడితో తస్మాత్ జాగ్రత్త !!  -- ఆనాడు చంద్రబాబుని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు .

 

 

Related Posts