యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విజయనగరం ప్రజల కు దాహార్తిని తీరుస్తున్న పెద్ద చెరువు ప్రక్షాళనకు జిల్లా అధికా రులు శ్రీకారం చుట్టారు. గురువారం జిల్లా కలెక్టరు హరిజవహర్ లాల్ మహాశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టరు వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది,స్వచ్ఛంద సంస్ధలు, విద్యార్ధులు, పట్టణ ప్రజలతో పెద్ద చెరువు శుద్ది మా బాధ్యత అంటూ వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత చెరువులో పుడుకు పోయిన వ్యర్ధలు, గుర్రెపు డొక్కులు, చెత్త, క్యారీ బ్యాగ్ లను తీసేవేసేందకు శుద్ధిని చేపట్టారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత గా ఈ మహాశుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు హరి జవహర్ లాల్ మాట్లాడుతు విజయనగరం ప్రజల చీరకాల కోరిక పెద్ద చెరువును సంరక్షించడమని, తమ వంతు బాధ్యతగా నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నిరంతరం ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతుంద ని, ఈ పెద్ద చెరువును ఒక మోడలా గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఏర్పడిందని జిల్లా కలెక్టరు అన్నారు. మంచి ప్రకృతి వాతవరణంలో ఉండే విధంగా దీని తయారు చేయడానికి అందరు తమ వంతు బాధ్యతగా సహకరించాలన్నారు.