యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బ్రిటీష్ పౌరసత్వమున్న రాహుల్ ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని హిందూ మహాసభకు చెందిన కార్యకర్త జై భగవాన్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు
2005-06 అర్ధిక సంవత్సరానికి కంపెనీ వార్షిక ఐటీ రిటర్నులో పౌరసత్వం అనే కాలమ్ లో రాహుల్ బ్రిటిషర్ అని రాశారని వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన పేపర్ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ ను ప్రశ్నించారు. ఓ కంపెనీ పేపర్ ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం సరికాదని చెబుతూ పిటిషన్ ను కొట్టివేశారు. 2015లో కూడా రాహుల్పై ఇదే తరహాలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.