YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల విడుదల

పోలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల విడుదల
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పోలిసెట్ 2019  ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసారు. ఫలితాల వివరాలను  మీడియాకు ఎస్బీటీఈటీ  ఛైర్మన్ జి.యస్. పండదాస్ వివరించారు. పాలిసెట్ 2019 పరీక్షకు ఒక లక్షా 24వేల 899 మంది హజరయ్యారు. వారి లో  బాలురు 70,051 మంది, బాలికలు  35,276 మంది ఉత్తీర్ణులయ్యారు. 120 మార్కులకు 36మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఏమీ లేదు. గత యేడాది 41 శాతం సీట్లు ఫిల్ అయ్యాయి.  209 కళాశాలల్లో 75వేల 971 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మే 24 నుంచి కౌన్సిలింగ్, దీనికి ప్రత్యేక నోటిఫికేషన్ వుంటుందని అయన అన్నారు. ఆన్ లైన్ నుంచి ర్యాంకు కార్డు లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాస్ వర్డ్.. సీటీఈఏపీ2019#. జూన్ 6 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని అయన అన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష లో ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థుల విజయకేతనం ఎగురువేసారు.  చింతా శివమాధవ్ (తూ.గో), మద్దులపల్లి ఫణి (గుంటూరు), చందం వివేక్ (తూ.గో),  కొమ్ముల చైత్రి (ప.గో), ఆకేళ్ల శ్రీనివాస్  (ప.గో), లింగాల అనంత్ (ప.గో), చందన కిరణ్మయి (తూ.గో), వి.ఆదిత్య (తూ.గో), అప్పరి హర్షిత (తూ.గో), పిచ్చాని గుణం (ప.గో)

Related Posts