YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీవీ9 నుంచి రవి ప్రకాశ్ కు ఉద్వాసన

 టీవీ9 నుంచి రవి ప్రకాశ్ కు ఉద్వాసన
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టీవీ9  సీఈవో   రవి ప్రకాశ్ ను ఆ సంస్థ  సీఈవో పదవి నుంచి తొలగించాలని టీవీ9 యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.  కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం అలందా మీడియా ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది. 
టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రవి ప్రకాష్పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పీఎస్లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు,  తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది.

Related Posts