YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీనియారిటీ కంటే యోగ్యతకే ప్రాధాన్యత తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు కొలీజియం

సీనియారిటీ కంటే యోగ్యతకే ప్రాధాన్యత తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు కొలీజియం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
న్యాయమూర్తుల పదోన్నతుల విషయంలో సీనియారిటీ కంటే యోగ్యతకే ప్రాధాన్యమివ్వాలని సుప్రీం కోర్టు కొలీజియం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. సుప్రీంకోర్టు జడ్జీలుగా ఝార్ఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అనిరుద్దా బోస్, గౌహతి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బోపన్నల పేర్లను కొలీజియం మరోసారి ప్రతిపాదించింది. సీనియారిటీ, ప్రాంతీయ ప్రాతినిధ్యాల కారణంగా జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌, జస్టిస్‌ బోపన్నల పేర్లపై అభ్యంతరం తెలుపుతూ కొలీజియానికి కేంద్రం తిరిగి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఇవాళ మరోసారి అవే పేర్లను ప్రతిపాదించింది. వీరితో పాటు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్య కాంత్‌ పేర్లను కూడా ప్రతిపాదించింది. జస్టిస్‌ గవాయ్‌ ప్రస్తుతం బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండగా జస్టిస్‌ కాంత్‌ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు.

Related Posts