యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తండ్రిలా కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న చంద్ర బాబు నాయుడు లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్‌కు ఎందుకివ్వలేకపోయారని వైసిపి నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నక్కజిత్తుల రాజకీయాలకు మరో వందేళ్ల పేటుంటు మీదే చంద్రబాబూ. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్స్ హతమారిస్తే కొడుకు శ్రావణ్‌ను మంత్రిని చేశారు. ఆరు నెలల గడువు ముగిసింది. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్‌కు ఎందుకివ్వలేకపోయావు అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.చట్ట సభలకు ఎన్నిక కాకుండానే గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు హత్య అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కు సీఎం చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టిన విషయం విదితమే. శ్రావణ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 10వ తేదీకి ఆరు నెలలు అవుతోంది. రాజ్యాంగ మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎవరైనా మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అటు అసెంబ్లీకి లేదా ఇటు మండలికి ఆరు నెలల్లో ఎన్నిక కావాలి. కానీ శ్రావణ్ ఎన్నిక కాలేదు.