యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మెక్సికో దేశంలో ఓ ప్రైవేట్ జెట్ విమానం కూలి13మంది మరణించారు. మాంటెర్రీ నుంచి లాస్ వేగాస్ నగరానికి వెళ్లే ప్రైవేటు జెట్ విమానం ఈ నెల5వతేదీ నుంచి జాడ లేకుండా పోయింది.జాడ లేకుండా పోయిన జెట్ విమానం మెక్సికో దేశంలోని మారుమూలన ఉన్న ఒకాంపో కొండలపై కూలిందని కోహుఇలా గవర్నరు మిగూల్ రిక్వెలేమ్ చెప్పారు. విమానం కూలిన స్థలం 13 మంది మృతదేహాలు కనిపించాయి. విమానంలో పదిమంది ప్రయాణికులతోపాటు ముగ్గురు విమాన ఉద్యోగులున్నారని గవర్నరు పేర్కొన్నారు. జెట్ విమానం మాంటెర్రికి180 కిలోమీటర్ల దూరంలోని మాన్‌క్లోవా నగరం నుంచి చివరిసారి రాడార్ కు అందుబాటులో లేకుండా పోయింది. కూలిపోయిన ఈ ఛాలెంజర్ 601 జెట్ విమానాన్ని కెనడా దేశానికి చెందిన బాంబర్డియార్ సంస్థ తయారు చేసింది. ఈ విమాన ప్రమాదానికి కారణాలు తెలియలేదు.