YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సన్న, చిన్నకారు రైతులకు మరింత లబ్దికలిగేలా పిఎంకెఎస్వై అమలు - సిఎస్ ఎల్వీ

సన్న, చిన్నకారు రైతులకు మరింత లబ్దికలిగేలా పిఎంకెఎస్వై అమలు - సిఎస్ ఎల్వీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రైతులకు మరింత మేలుచేసే రీతిలో ఇంటిగ్రేటెడ్ ప్రణాళిక విధానంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పిఎంకెఎస్వై) పధకాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  చించారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలో పిఎంకెఎస్వై పధకం అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ  సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామాల్లో స్థానికంగా ఉండే నిరుద్యోగ యువత భాగస్వామ్యంతో ఈపిఎంకెఎస్వై పధకాన్ని అమలుచేసే శాఖలు మరింత సమర్ధవతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు.అంతేగాక ఈపధకాన్ని అమలుచేసే శాఖలు ఇంటిగ్రేటెడ్ ప్రణాళికను రూపొందించి ఆప్రకారం రైతులకు మరింత మేలు చేకూర్చే రీతిలో దీనిని అమలు చేయాలన్నారు. ఈప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పధకం అమలులో ఉద్యానవన శాఖ నోడలు ఏజెన్సీగా ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసి మరింత పంటదిబడి వచ్చే విధంగా ఈపధకాన్నిమరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని సిఎస్ ఆదేశించారు. తోటల పెంపకంలో భాగంగా తవ్వే
బోరులన్నిటినీ రీచార్జి చేసి వాటి ద్వారా ఆ యా పంటలకు భూగర్భ జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అప్పడే రైతులకు పూర్తిగా మేలు కలుగుతుందని సిఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
పిఎంకెఎస్వై పధకం కింద ముఖ్యంగా ఎస్సి,ఎస్టి రైతులు,సన్న చిన్నకారు రైతులకు పూర్తి లబ్ది చేకూర్చేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. విభిన్న పంటలు పండించేందుకు ఈపధకం పూర్తిగా ఉపయోగపడాలని అప్పుడే ఈపధకం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. అంతేగాక ఈపధకం అమలు ద్వారా ఎంత మేరకు ఉత్పత్తి ఉత్పాదక పెరిగిందనేది ముఖ్యమని అన్నారు.అదేవిధంగా ఈపధకం ఆహారశుద్ధి పరిశ్రమలకు దోహదం చేసే రీతిలో ఉండాలని సిఎస్ చెప్పారు.పధకం అమలు తర్వాత ఎంత మంది రైతుల జీవన విధానాల్లో ఎలాంటి పురోగతి వచ్చింది ముఖ్యంగా
వ్యవసాయ రంగం నుండి సేవల రంగానికి మారారనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కేంద్రప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజిమెంట్(ఐఅండ్ ఎం)సంయుక్త కార్యదర్శి ఎ నీరజ
మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పధకం ఇంటిగ్రేటెడ్ ప్రణాళిక విధానంతో అమలు చేయాలన్నదే ఈ పధకం ముఖ్య ఆశయమని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యత ఉందని ఆదిశగా ఈపధకం అమలుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పారు.  వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ 2018-19 ఏడాదిలో పిఎం కెఎస్వై పధకం కింద వ్యవసాయశాఖకు 100కోట్ల రూ.లు కేటాయించగా సుమారు 70కోట్ల రూ.లు ఖర్చుచేసి 80వేల హెక్టార్లకు నీటిలకభ్యత కల్పించి 48వేల మంది రైతులకు ప్రయోజనం కల్పించామన్నారు. ముఖ్యంగా నీటి
సంరక్షణ పనులు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, ఫారమ్  ఫాండ్లు,చెక్ డ్యాంల నిర్మాణం,బోరుల కొత్త బోరులు
తవ్వకం,పనిచేయని బోరుల పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టడం ద్వారా రైతులకు ఈపధకం కింద మేలు కలిగించామని పేర్కొన్నారు. రాష్ట్ర  గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ 2018-19 ఏడాదిలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 410కోట్ల రూ.లు అంచనాతో 370 వాటర్ షేడ్డు పధకాలు చేపట్టగా ఇప్పటికే 60శాతం పైగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర జలవరుల శాఖ కార్యదర్శి శిశిభుషణ్ కుమార్ మాట్లాడుతూ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పధకం కింద మైనర్ ఇరిగేషన్ పధకాల కింద 2లక్షల
96వేల 577 హెక్టార్లకు సాగునీరు అందించేందుకు 4270 కోట్ల రూ.లు అంచనా వ్యయంతో 8ప్రాజెక్టులను చేపట్టగా ఇప్పటికే మద్దిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా మిగతా 7ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.ఎపి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పిడి సూర్యనారాయణ మాట్లాడుతూ 2019-20 ఏడాదిలో లక్షా 74వేల హెక్టార్లకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈసమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమీషనర్ ఎన్.మురళీధర్ రెడ్డి,ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Related Posts