YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జిల్లా సైన్స్ అధికారిణిని అభినందించిన కలెక్టర్

జిల్లా సైన్స్ అధికారిణిని అభినందించిన కలెక్టర్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని  జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా సైన్స్ అధికారి లలితా కుమారిని అభినందించారు. గత నెల 22 నుండి 26 వరకు ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో కౌన్సిల్ ఫర్ రీసర్చి ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ, భారత దేశానికి చెందిన లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ ఆసియా స్టేమ్  కార్యక్రమం అంతర్జాతీయ స్ధాయిలో మెట్టు మొదటి సారిగా జరిగింది. దేశ వ్యాప్తంగా 80 మంది వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు హాజరుకాగా రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది పాల్గొన్నారు.  అందులో  రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కర్నూలు  జిల్లా నుండి గూడూరు జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు, జిల్లా సైన్స్ అధికారి లలితా కుమారి హజరయ్యారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని  కలెక్టర్ ఆమెను అభినందించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులను శాస్త్రవేతంగా తీర్చి దిద్దే క్రమంలో సైన్స్  టెక్నాలజి, ఇంజనిరింగ్, మాధ్స్ ద్వారా  విద్యార్ధులకు ప్రేరేపించడమే ఈ కార్యక్రమం ముఖ్య 
ఉద్దేశమన్నారు. అందువల్ల స్టేమ్ పట్ల బాగ అవగాహన కల్పించాలని అన్నారు. భవిష్యతు రోజుల్లో  ఈ కార్యక్మం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పటాన్ శెట్టి రవి 
సుభాష్, డీఈవో తెహరాసుల్తానా, జిల్లా సైన్స్ అధికారి లలితా కుమారి పాల్గొన్నారు.

Related Posts