YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నీట్ కటీఫ్ మార్కులు తగ్గించిన కేంద్రం

 నీట్ కటీఫ్ మార్కులు తగ్గించిన కేంద్రం
మెడికల్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్‌’ కటాఫ్‌ మార్కులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఫలితాలు విడుదల చేసినప్పుడు కటాఫ్‌ మార్కులలో 50 శాతంగా ఉన్న కటాఫ్‌ పర్సంటేజీలో 6 శాతం తగ్గించింది. ఫలితంగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 44 శాతం, దివ్యాంగులు 39 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 34 శాతం మార్కులు సాధిస్తే మెడికల్‌, పీజీ కోర్సుల్లో (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) అర్హత సాధించవచ్చు. ఇంతకు ముందు ఈ కటాఫ్ మార్కులు విభాగాల వారీగా 50, 45, 40 గా ఉండేది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సమాచారం అందించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2019-20 నీట్‌ పీజీ కటాఫ్‌ మార్కులను 6 పర్సెంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పీజీ వైద్య విద్య కోర్సులో చేరేందుకు మరికొంతమందికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు కాళోజీ ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. దీనికి సంబంధించి మే 10న నోటిఫికేషన్‌ 
జారీ చేయనుంది. కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేసే ఈ పీజీ సీట్లకు మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే 13న ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ 171 సీట్లు, డెంటల్‌లో 49 సీట్లు మిగిలిపోయాయని వర్సిటీ ప్రకటించింది. 

Related Posts