యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
బాలీవుడ్ హాట్ నటి రాఖీ సావంత్ వివాదాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే రకరకాల పోస్టులు చేస్తూ, వివాదాస్పద కామెంట్లు పెడుతూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా, రాఖీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్ జెండాను పట్టుకోవడమే కాకుండా దాన్ని తన గుండెలకు హత్తుకుని ఉన్న ఆ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ‘ఐ లవ్ మై ఇండియా. కానీ, ఇది ‘ధారా 370’లో నా పాత్ర’ అని పాకిస్థాన్ జెండాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో రాఖీ డ్రెస్ కూడా సెక్సీగా ఉంది. దీంతో నెటిజన్లు తమ చేతులకు పని చెప్పారు. అసభ్య పదజాలంతో రాఖీని, పాకిస్థాన్‌ను తిడుతూ కామెంట్లు మొదలుపెట్టారు. ఈ కామెంట్లతో విసిగిపోయిన రాఖీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టింది. ఈసారి వీడియో రూపంలో వివరణ ఇచ్చింది. అసలు
తాను పాకిస్థాన్ జెండా ఎందుకు పట్టుకున్నానో వెల్లడించింది. ‘ధారా 370’ సినిమాలో పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి పాత్రలో తాను నటిస్తున్నానని, కశ్మీరి పండిట్స్ నేపథ్యంలో సినిమా
ఉంటుందని రాఖీ వివరించింది. చిన్న చిన్న పిల్లల్ని జిహాదీలుగా మారుస్తోన్న ఉగ్రవాద సంస్థలను సినిమాలో తాను బట్టబయలు చేస్తానని పేర్కొంది. మాతృదేశంపై విపరీతమైన భక్తి కలిగిన అమ్మాయి పాత్రలో తాను కనిపిస్తానని స్పష్టం చేసింది. మొత్తానికి చాలా రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న రాఖీ.. మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది.