YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కనుమరుగు అవుతున్నకుల వృత్తులు

 కనుమరుగు అవుతున్నకుల వృత్తులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కుల వృత్తులు కనుమరుగు అవుతున్నాయి. ఆధునిక పనిముట్లు అందుబాటులోకి రావడంతో 90 శాతం కుమ్మరి, కమ్మరి, కంసలి, సలోళ్ళ మగ్గం లాంటి కులాలు కనిపించడం లేదు. తాజాగా కుల వృత్తిని నమ్ముకున్న రజకుల కడుపు నిండడం లేదు. కూలి పెంచమని అడిగిన పాపానికి రజకులను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ అమానుష సంఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా  అవుకు మండలం శివ వరం గ్రామంలో రజకులపై గ్రామ పెద్దలు కక్షగట్టారు.  దోభి  కూలి పెంచాలని గత కొంతకాలంగా రజకులు కోరుతున్నారు.  ఇది నచ్చని గ్రామ పెద్దలు మేము ఇచ్చిన మేరకే కూలి తీసుకోవాలని ఆదేశించారు ..దీంతో గ్రామ పెద్దలకు రజకులకు మధ్య వివాదం నెలకొంది. గత కొంతకాలంగా రజకులు గ్రామంలో వారికి బట్టలు ఉతకడం నిలిపేశారు. దీంతో గ్రామ పెద్దల ఆగ్రహం మరింత పెరిగింది. గ్రామంలోని రజకులను సాంఘిక బహిష్కరణ విధించాలని నిర్ణయించారు. గత మూడు రోజుల క్రితం గ్రామంలో దండోరా  వేయించి రజక కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయారాదని.. అంతే కాక వారికి మౌలిక అవసరాలైన పాలు, మంచినీరు అందించ వద్దని హుకుం జారీ చేశారు. అంతేకాక ఇక రజకులకు చెందిన పంట పొలాల్లోకి కూలీలు వెళ్లవద్దని,  రజకులకు చెందిన బర్రెలు, గొర్రెలు, గాడిదలను గ్రామస్తుల పొలాల్లో మేప వద్దని నిర్ణయించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా మంగళవారం గ్రామంలోని కొంతమంది రజకుల ఇళ్లపై దాడిచేసి గ్రామం వదిలి వెళ్లాలని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో వారు పిల్లాపాపలతో కలిసి అవుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అవుకు తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.  గతంలో రజకులకు గ్రామంలోని ఒక కుటుంబానికి దుస్తులు ఉతికి నందుకు సంవత్సరానికి 3500 రూపాయలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఖర్చులు పెరిగిన కారణంగా ఒక కుటుంబానికి 5500 రూపాయలు మేర పెంచి ఇవ్వాలని రజకులు కోరుతున్నారు ... ఈ వివాదం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇటు పోలీసు ఆటు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు గ్రామ పెద్దలతో పాటు రజకులతో చర్చలు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య  రాజీ ప్రయత్నాలు చేపట్టారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి రజక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా రజక నాయకులు కోరుతున్నారు. 

Related Posts